#Sangareddy

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Sangareddy.

10 Stories

Stories tagged with #Sangareddy

హైదరాబాద్‌ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో యువ వైద్యురాలి అనుమానాస్పద మృతి.. స్నేహితుడు పరారీ
crime,news,telangana

హైదరాబాద్‌ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో యువ వైద్యురాలి అనుమానాస్పద మృతి.. స్నేహితుడు పరారీ

హైదరాబాద్‌లో 27 ఏళ్ల యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. హఫీజ్‌పేట్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

2 అక్టో, 20261 min read
కన్న కొడుకులే కాదన్నారు.. చివరకు సొంత పొలంలోని బావిలోనే దంపతుల బలవన్మరణం
news,telangana

కన్న కొడుకులే కాదన్నారు.. చివరకు సొంత పొలంలోని బావిలోనే దంపతుల బలవన్మరణం

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కె) గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉన్న వ్యవసాయ భూమిని కొడుకుల పిల్లలకు రాసిచ్చినా వృద్ధాప్యంలో కన్న కొడుకుల ఆదరణకు నోచుకోలేకపోయిన దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంటి నుంచి గెంటివేయడంతో అద్దె ఇంట్లో ఉంటున్న వారు చివరకు తమ వ్యవసాయ పొలంలోని బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు.

30 సెప్టెం, 20261 min read
సంగారెడ్డిలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 15 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
news,telangana

సంగారెడ్డిలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 15 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. మునిపల్లి మండలం పెద్దలోడి జెడ్‌పీహెచ్‌ఎస్‌లో బిర్యానీ తిన్న 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారితో పాటు వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు కూడా అనారోగ్యానికి గురికాగా, ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

17 సెప్టెం, 20261 min read
ఆరుగురు విద్యార్థుల మృతి.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్ అరెస్ట్
crime,news,telangana

ఆరుగురు విద్యార్థుల మృతి.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్ అరెస్ట్

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్లలో ఆరుగురు విద్యార్థులు చెరువులో పడి మృతిచెందిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్‌ను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మృతదేహాల పోస్టుమార్టం సందర్భంగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకోబోమని బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి.

17 సెప్టెం, 20261 min read
రేషన్ కార్డు కాగితం కాదు.. పేదల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
news,politics,telangana

రేషన్ కార్డు కాగితం కాదు.. పేదల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదలకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన చేయలేదని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

15 ఆగ, 20262 min read
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్‌ ఢీకొని ఏడుగురు మృతి
news,technology,district

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్‌ ఢీకొని ఏడుగురు మృతి

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం సత్వార్‌ గ్రామ శివారులో జాతీయ రహదారి-65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ట్యాంకర్‌ ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

11 ఆగ, 20261 min read
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
news,telangana

ఆగస్టు 15న సంగారెడ్డిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం: ఉత్తమ్‌

ఆగస్టు 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 1.06 కోట్ల రేషన్‌ కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు ఆహార భద్రత అందుతోందన్నారు.

11 ఆగ, 20262 min read
సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దామోదర రాజనర్సింహ
news,telangana,district

జోగిపేట నకిలీ డాక్టర్ ఘటనపై మంత్రి సీరియస్.. డీసీహెచ్‌ఎస్‌, సూపరింటెండెంట్‌పై ఆగ్రహం

జోగిపేట ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ వైద్యుడి స్థానంలో నకిలీ వ్యక్తి వైద్యుడిగా విధులు నిర్వహించిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేదిగా ఉందన్నారు,.

7 ఆగ, 20262 min read
ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
telangana,news

ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 15 నుంచి 1.05 కోట్ల కొత్త PDS రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించగా, అదే రోజు 119 నియోజకవర్గాల్లో కార్డుల పంపిణీ జరగనుంది.

6 ఆగ, 20262 min read
24 గంటల్లో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్
telangana,district,news

24 గంటల్లో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

23 జులై, 20261 min read