చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆమెకు నివాళులు అర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరంగా, రాష్ట్ర తెగువకు ప్రతీకగా ఐలమ్మ నిలిచారని కొనియాడారు. రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతికి కృషి చేయడమే ఆమెకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక వెబ్‌సైట్, ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి డిజిటల్ విధానంలో ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం 250 గజాల ఇళ్ల స్థలం, హెల్త్ కార్డులు, ఆసరా పెన్షన్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటి డిమాండ్లపై కమిటీతో చర్చించారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే తాను మాట్లాడుతున్నానని, పార్టీని బలహీనపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మాది అసలైన కాంగ్రెస్ రక్తమని, తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడిన ఉద్యమకారులను కించపరచొద్దని సూచించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను తెలంగాణ సమాజం ఎప్పటికీ గౌరవంగా స్మరించుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమానికి అందించిన విశిష్ట సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కార్యక్రమం, సంతాప సభ ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రజాసేవలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమం కోసం ఏకంగా పెళ్లినే త్యాగం చేసిన నాయకుడు... స్వరాష్ట్రం వచ్చేవరకు బ్రహ్మచర్యం పాటిస్తానని శపథం చేసిన వ్యక్తి... ఉద్యమం గెలిచిన తర్వాతే తిరుమలలో వివాహం చేసుకున్న నాయకుడు... అలాంటి బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. ఆయన మరణంతో తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎవరు? తెలంగాణ కోసం ఎందుకు అలాంటి శపథం చేశారు? ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణలోని హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అర్చకులు, గిరిజన అర్చకుల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం నిర్వహించింది. ధూపదీప నైవేద్య (డీడీఎన్) భత్యం పెంపుతో పాటు పలు సంక్షేమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిటీ హామీ ఇచ్చింది.