తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన.. కేసీఆర్ ఇంటిపై దాడి, మహిళా ఎమ్మెల్యేలపై దాడులు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ సిఫారసు లేఖను గవర్నర్‌కు పంపించారు. రాజీనామాకు సురేఖ అంగీకరించకపోవడంతో బర్తరఫ్ ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పలు కీలక పదవుల్లో మార్పులు చేసింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే బర్తరఫ్‌కు సిఫార్సు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో కొండా సురేఖ తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్‌తో తాను ఎలాంటి మంతనాలు చేయలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉండి ఈ మాట చెబుతున్నానని పేర్కొన్న ఆయన.. ఇదే విషయాన్ని కవిత చెప్పగలరా? అని ప్రశ్నించారు. కష్టకాలంలో కేసీఆర్ వెంట ఉన్నది తానేనని, కవిత కాదని వ్యాఖ్యానిస్తూ ఆమె విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, పార్టీలోని అంతర్గత పరిణామాలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ గీత దాటిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం, కేబినెట్ పనితీరులో మార్పులు అవసరమని సూచించారు. రాష్ట్రంలో పెన్షన్‌ను రూ.4,000కు పెంచడంతో పాటు రైతు భరోసాను కొనసాగించాలని కోరారు.
నర్సంపేటలో ప్రెస్‌మీట్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన ఆయన.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా తనను ఏమీ చేయలేరంటూ రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ నోటి దురుసు, అహంకారం, అవినీతి పాలనే ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి భస్మాసుర హస్తంగా మారుతుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ కుటుంబం నడుపుతున్నది ప్రజా పాలన కాదని విమర్శించారు. సీఎం కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు సంస్థలు, కాంట్రాక్టులపైనా ఆరోపణలు చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం చుట్టూ ఉద్రిక్తత కొనసాగుతోంది. గద్దె కూల్చివేత తర్వాత బీఆర్ఎస్ నేతలు మళ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, తొలగించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం వద్ద రాత్రంతా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పీఠంపై రేసు మెుదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.
“సింగరేణిలో శాశ్వత, కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత కోరారు. ప్రభుత్వ విధానాలు, పెండింగ్ బకాయిల వల్ల సింగరేణిపై భారీ ఆర్థిక భారం పడుతోందని ఆమె పేర్కొన్నారు.”