ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ శివాలయంలో సోమవారం అరుదైన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకటి కాదు.. ఏకంగా మూడు నాగుపాములు శివలింగం చుట్టూ తిరుగుతూ, అనంతరం దాని ముందు పడగవిప్పి నిలబడటం కనిపించింది. భక్తులు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించడంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని ప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామి ఆలయ సముదాయంలో చోరీ కలకలం రేపింది. రాములవారి గుడిలోని శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి పంచలోహ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు ఆలయ వర్గాలు గుర్తించాయి.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనుండగా, బుధవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. పవిత్రోత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
తిరుమలలో భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేక పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. కల్యాణ వేదికలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో నాలుగు యుగాలతో పాటు భారతీయ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మిక అంశాలను ప్రతిబింబించేలా 14 ప్రత్యేక థీమ్స్‌ను తీర్చిదిద్దారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనుల కోసం దాదాపు 170 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఖడే హనుమాన్’ ఆలయాన్ని తొలగించారు. అయితే ఆలయంలోని హనుమంతుడి విగ్రహాన్ని తరలించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాలుగు రోజుల పాటు భారీ యంత్రాలతో ప్రయత్నించినా విగ్రహం ఒక్క అంగుళం కూడా కదలకపోవడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.
అయోధ్య రామమందిరం నిర్వహణ, పరిపాలనకు కీలక అడుగు పడింది. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో) రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా వచ్చిన 5,585 దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఆయనను ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఎంపిక చేశారు.
తమిళనాడులోని 52 ప్రముఖ ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆలయాల్లో రీల్స్, వీడియోల చిత్రీకరణతో పవిత్రతకు భంగం కలుగుతోందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది.
నాగుల పంచమి వేళ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. బారికేడ్ల కు కరెంట్ షాక్ వచ్చిందన్న తప్పుడు సమాచారంతో భక్తులు ఆందోళన తొక్కిసలాటకు దారి తీసింది
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమల శ్రీవారి 2026 వార్షిక పుష్పయాగం సేవ టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల ద్వారా భక్తులకు ఒకే రోజు రెండుసార్లు శ్రీవారి దర్శనం చేసుకునే అరుదైన అవకాశం లభించనుంది.
వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్ర మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. 40 రకాల కూరగాయలు, 22 రకాల పండ్లతో శాఖంబరి అలంకరణ, ఉదయం 10 గంటలకు నుండి వేలాది మంది భక్తుల దర్శనంఇస్తున్న అమ్మవారు .
బొడుప్పల్‌లోని శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయంలో ఆషాఢ మాస వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ శాకాంబరీ దేవి అవతారంలో విశేష పుష్ప, కూరగాయల అలంకరణతో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.
హైదరాబాద్ ప్రజా భవన్‌లో నిర్వహించిన ఆషాఢ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రజల ఆయురారోగ్యాలు, ప్రకృతి సమతుల్యత కోసం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఆంజనేయస్వామి విగ్రహం మాయమైన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.