#Theft Case

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Theft Case.

9 Stories

Stories tagged with #Theft Case

బొల్లారం ఆయుధాల చోరీ వెనుక సంచలన కుట్ర..ముగ్గురు ఆర్మీ జవాన్లే కీలక పాత్ర
crime,news,telangana

బొల్లారం ఆయుధాల చోరీ వెనుక సంచలన కుట్ర..ముగ్గురు ఆర్మీ జవాన్లే కీలక పాత్ర

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో పోలీసులు భారీ కుట్రను ఛేదించారు. బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, సంపన్నుల ఇళ్లలో దోపిడీలకు ఈ ఆయుధాలను ఉపయోగించేందుకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో ముగ్గురు సర్వీసులో ఉన్న ఆర్మీ జవాన్లతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

3 అక్టో, 20262 min read
అప్పుల కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. తీరని అప్పులతో దొంగగా మారాడు
crime,news,andhra-pradesh

అప్పుల కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. తీరని అప్పులతో దొంగగా మారాడు

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వెన్న దుర్గా దినేష్ అలియాస్ సాయి జీవితం అనేక మలుపులు తిరిగింది. బెట్టింగ్‌లో చేసిన అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్నా అప్పులు తీరలేదు. చివరకు చోరీల బాట పట్టిన సాయి.. జైలులో పరిచయమైన వారికి దొంగతనాల్లో శిక్షణ ఇచ్చి ముఠాగా ఏర్పడి వరుస చోరీలకు పాల్పడ్డాడు. పల్నాడు ప్రాంతంలో జరిగిన భారీ చోరీ కేసులో సాయితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

30 సెప్టెం, 20262 min read
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
crime,news

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజుకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాగారం ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వినోద్, శేషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లేశ్‌తో వినోద్‌కు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

29 సెప్టెం, 20261 min read
నటి రాధ ఫిర్యాదుపై అక్క అంబిక స్పందన.. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు
cinema,entertainment,crime,news

నటి రాధ ఫిర్యాదుపై అక్క అంబిక స్పందన.. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు

సొంత సోదరి రాధ తనపై దొంగతనం కేసు పెట్టడంపై నటి అంబిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి చెక్కులు దొంగతనం చేయలేదని స్పష్టం చేశారు. ఆ చెక్కులను రాధే తనకు ఇచ్చారని, అనంతరం పేమెంట్స్‌ను ఆమెనే బ్లాక్ చేశారని అంబిక తెలిపారు. ఆస్తులు, వ్యాపారం, బంగారు ఆభరణాల విషయంలో చాలాకాలంగా తమ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

23 సెప్టెం, 20261 min read
16 ఏళ్ల ఆర్మీ అనుభవంతో ఆయుధాల చోరీ.. బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు
crime,news,telangana

16 ఏళ్ల ఆర్మీ అనుభవంతో ఆయుధాల చోరీ.. బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు

బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో నిందితుడు మల్లేష్‌ను విచారించిన పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. చోరీకి నాలుగు నెలల ముందే అతడు పథకం రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. ఆదివారం గార్డులు, ఆర్మీ అధికారుల కదలికలు తక్కువగా ఉంటాయని భావించి అదే రోజును ఎంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

22 సెప్టెం, 20262 min read
ఆర్మీ ఆయుధాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు..ఎట్టకేలకు చిక్కిన రిటైర్డ్ హవల్దార్ మల్లేశ్
crime,news,telangana

ఆర్మీ ఆయుధాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు..ఎట్టకేలకు చిక్కిన రిటైర్డ్ హవల్దార్ మల్లేశ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఇటీవలే పదవీ విరమణ పొందిన హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్‌ను గుర్తించినట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రిటైర్మెంట్‌పై అసంతృప్తితో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చోరీ చేసి.. వాటిని నాగర్‌కర్నూల్‌లోని తన స్వగ్రామం, యాప్రాల్‌లోని మరో ప్రాంతంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

11 సెప్టెం, 20263 min read
బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు.. మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్? పోలీసుల తాజా క్లారిటీ ఇదే
news,telangana

బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు.. మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్? పోలీసుల తాజా క్లారిటీ ఇదే

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ కేసులో అరెస్టులపై వస్తున్న వార్తలను తెలంగాణ పోలీసులు ఖండించారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ స్పష్టం చేశారు. మరోవైపు, రెజిమెంట్ సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది.

11 సెప్టెం, 20262 min read
ఆర్టీసీ బస్సు చోరీ.. సినీ ఫక్కీలో చేజింగ్ తర్వాత అరెస్ట్
crime,district,news,telangana

ఆర్టీసీ బస్సు చోరీ.. సినీ ఫక్కీలో చేజింగ్ తర్వాత అరెస్ట్

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ బస్సును చోరీ చేసి నిర్లక్ష్యంగా నడుపుతూ పలువురు వాహనదారులను ఢీకొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

23 జులై, 20261 min read
24 గంటల్లో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్
telangana,district,news

24 గంటల్లో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

23 జులై, 20261 min read