మహారాష్ట్రలో సరదాగా సాగాల్సిన విహారయాత్ర విషాదంగా మారింది. పుణెలోని అలందీకి చెందిన విద్యార్థులు రాయ్‌గఢ్ జిల్లాలోని దివేగార్ బీచ్‌కు పిక్నిక్‌కు వెళ్లగా సముద్రంలో ఈతకు దిగిన 8 మంది విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తణుకుకు చెందిన ఓ కుటుంబం చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో మహిళను స్థానిక మత్స్యకారులు రక్షించగా.. ఆమె భర్త, కుమారుడు, కుమార్తె గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు, బోట్ల సాయంతో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.
నేపాల్ వరదల్లో చిక్కుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ 28 మంది కైలాస్ మానస సరోవర్ యాత్రికులు శనివారం స్వస్థలాలకు చేరుకున్నారు. కేవలం పది నిమిషాల ఆలస్యం, టీ తాగేందుకు తీసుకున్న చిన్న విరామం తమ ప్రాణాలను కాపాడాయని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో రాఖీ పర్వదినాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో ఓ ఆటో డ్రైవర్ కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పోలీసులు ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో.. వినోద్ కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు అసలు కారణమేంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేపాల్‌లో భోటేకోశీ నదికి ఆకస్మికంగా భారీ వరదలు రావడంతో హైదరాబాద్ నుంచి పర్యటనకు వెళ్లిన 156 మంది తెలుగు యాత్రికుల బృందంలో 140 మంది ఆచూకీ తెలియకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మరో 16 మంది అనారోగ్య కారణాలతో హోటల్‌లోనే ఉండిపోవడంతో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం కుటుంబసభ్యులు అధికారులను, టూర్ ఏజెన్సీని సంప్రదిస్తున్నారు.
శ్రీశైలంలోని వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మూడు రోజులుగా గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన రావడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతిచెందినట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో కొడుకును కాపాడే ప్రయత్నంలో తల్లిదండ్రులు కూడా మృతి చెందిన విషాద ఘటన జరిగింది. మొబైల్ ఫోన్ విషయంలో గొడవ తర్వాత 19 ఏళ్ల కునాల్ కొండపైకి వెళ్లాడు. దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు, పోలీసులు అతడిని నచ్చజెప్పారు.
కోల్‌కతాలోని న్యూమార్కెట్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రీ స్కూల్ వీధిలోని ఓ హోటల్‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో చిన్నారి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బంగ్లాదేశీయులేనని అధికారులు తెలిపారు.