వారణాసిలో లాట్ భైరవ్ ఆలయ వార్షిక ఉత్సవంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బందోబస్తు విధుల్లో ఉన్న పలువురు పోలీసులు వేదికపై మహిళా కళాకారుల డ్యాన్స్‌ను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ కెమెరాలకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కేసు విచారణ కోసం కోర్టుకు వచ్చిన మహిళపై ఆమె భర్త పోలీసు, లాయర్ల సమక్షంలోనే దాడికి పాల్పడ్డాడు. జుట్టు పట్టుకుని కిందపడేసి కొట్టడంతో పాటు గొంతు నులిమాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 1999 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఆయన.. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్‌గా నియమితులయ్యారు. పలుమార్లు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా, ఇంటర్వ్యూల వద్ద ఎదురైన నిరాశలను అధిగమించి చివరకు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా బైక్‌పై పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం ఎంత ప్రమాదకరమో చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఓ బైక్‌పై ఓ వృద్ధుడు ఏకంగా ఆరుగురు నుంచి ఏడుగురు చిన్నారులను తీసుకెళ్తున్న దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి.
బెంగళూరుకు చెందిన A1 స్పోర్ట్స్ వరల్డ్ స్టార్టప్ తీసుకున్న ఓ నియామక నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులను ఇకపై ఉద్యోగాల్లోకి తీసుకోబోమని సంస్థ వ్యవస్థాపకుడు కార్తీక్ ఎస్‌జీ ప్రకటించారు.
బీజేపీలో కీలక సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జ్‌లను అధిష్ఠానం నియమించింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ బాధ్యతలను సునీల్ బన్సల్‌కు అప్పగించగా.. తెలంగాణకు అభయ్ పాటిల్, రేఖా శర్మలను కో-ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ యువకుడు పాము కాటుకు గురైన తర్వాత చేసిన పని ఆస్పత్రిలో కలకలం రేపింది. తనను కరిచిన పాము ఏ జాతికి చెందిందో వైద్యులకు తెలుస్తే సరైన చికిత్స అందుతుందని భావించిన అతడు ఆ పామును సజీవంగా పట్టుకుని బ్యాగులో పెట్టి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బ్యాగులో నుంచి పామును బయటకు తీయడంతో వైద్యులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
సాధారణంగా భార్య మరొకరితో వెళ్లిపోయిందని తెలిస్తే భర్త ఆగ్రహానికి గురవుతాడు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో మొబైల్ నెట్‌వర్క్ సమస్యపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా సమస్య పరిష్కారం కావడం లేదంటూ టవర్ పనుల కోసం వచ్చిన టెలికాం టెక్నీషియన్‌ను చుట్టుముట్టి, ఏకంగా మొబైల్ టవర్‌కు కట్టేశారు.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కౌశాంబి జిల్లాలోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో 11 మంది కార్మికులు మృతి చెందారు. మరో 10 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కర్ణాటకలోని బెలగావిలో సండే పార్టీ సందర్భంగా చికెన్ ముక్కల విషయంలో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ దారుణ హత్యకు దారితీసింది. ఎక్కువ చికెన్ తింటున్నాడని ఆగ్రహించిన సీతారామ్‌తో గొడవపడిన అరుణ్.. వంట కత్తితో అతడి ఛాతిలో పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారామ్ మృతి చెందాడు.
పాఠశాలల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థలు సమానత్వం, క్రమశిక్షణ కోసం యూనిఫాం నిబంధనలను అమలు చేసే హక్కు కలిగి ఉంటాయని స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఓ యువకుడి జేబులో కొత్త స్మార్ట్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. యువకుడి దుస్తులకు మంటలు అంటుకుని, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.