ఢిల్లీ లో వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే నేరస్థుల మనసుల్లో పోలీసులంటే భయం కలిగేలా పటిష్టమైన పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించింది. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. అసలు నేరమే జరగకుండా నిరోధించడమే ముఖ్యమని స్పష్టం చేసింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆందోళనకారులను తరలించేందుకు సిద్ధమైన పోలీసు బస్సు డ్రైవర్ వద్ద నుంచి ఓ మహిళా కార్యకర్త తాళం చెవిని లాక్కొని బస్సు కదలకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్కులో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో సమీపంలోని లేడీ శ్రీరామ్ కాలేజీ (LSR) విద్యార్థినుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి సాధారణ తరగతులను రద్దు చేసిన కాలేజీ.. బుధవారం ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. సదర్ బజార్ ప్రాంతంలో పెన్సిల్, పెన్ను వంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన బాలికను ఓ వ్యక్తి మాయమాటలతో దుకాణంలోకి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సహా నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో పడేయగా.. కుక్కలు పీక్కుతిన్న స్థితిలో పోలీసులు గుర్తించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన కలకలం రేపింది. కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలికపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో విధుల్లో ఉన్న పోలీసులపై ఓ గుంపు దాడికి పాల్పడింది. బైక్‌ను సీజ్ చేశారన్న కోపంతో హెడ్ కానిస్టేబుళ్ల కళ్లలో కారం చల్లి, ఇటుకలు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
ఢిల్లీలో 1984లో హత్య చేసి పరారైన నత్తూ అలియాస్ నత్తూలాల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నేరం చేసినప్పుడు 23 ఏళ్ల వయసున్న అతడు.. దాదాపు 42 ఏళ్ల పాటు తన గుర్తింపును, ఆచూకీని దాచుకుంటూ తప్పించుకున్నాడు. తాజాగా 65 ఏళ్ల వయసులో ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు.
ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా కొనసాగించడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనల పేరుతో నగరాన్ని బందీగా మార్చడం సరికాదని శుక్రవారం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ జంతర్‌మంతర్‌లో నిర్వహించిన పేపర్ లీక్ నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నోయిడాకు చెందిన 25 ఏళ్ల రుచికా సింగ్‌పై కేసు నమోదైంది. నోయిడా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తదుపరి విచారణ కోసం ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభించారు.