దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ నేరాల కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో దాదాపు రెండు వారాల పాటు నిర్వహించిన ప్రత్యేక సోదాల్లో మ్యూల్ ఖాతాలు, కేవైసీ పత్రాలు సమకూర్చుతున్న 100 మందికి పైగా ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకలో ఓ యువరైతు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు, పొలాలు ఉండి కష్టపడి వ్యవసాయం చేస్తున్న యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని ఆయన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీల తరహాలో దీనినీ ‘ఆరో గ్యారంటీ’గా పరిగణించాలని కోరారు.
బెంగళూరుకు వలస వచ్చి స్థిరపడిన కొందరు ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇలాంటి ఎమ్మెల్యేలు డజనుకుపైగా ఉన్నారని, వారి జాబితా తన వద్ద ఉందని డీకే పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ.. ఆ ఎమ్మెల్యేల పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది.
బెంగళూరులో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ఖాళీ ప్రదేశంలో పడివున్న పాత పరుపును తరలించేందుకు ప్రయత్నించిన కార్మికులకు అందులోంచి ఓ కాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో అది 28 ఏళ్ల అనుసూయ మృతదేహంగా గుర్తించారు.
బెంగళూరుకు చెందిన A1 స్పోర్ట్స్ వరల్డ్ స్టార్టప్ తీసుకున్న ఓ నియామక నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులను ఇకపై ఉద్యోగాల్లోకి తీసుకోబోమని సంస్థ వ్యవస్థాపకుడు కార్తీక్ ఎస్‌జీ ప్రకటించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. హరిహర బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీశ్‌ను ఉద్దేశించి మంత్రి ‘చెప్పులతో కొట్టాలి’ అంటూ వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే హరీశ్‌తో పాటు బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
కర్ణాటకలోని దావణగెరెలో గాయపడిన చిరుతను రక్షించేందుకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బందిపై అది ఒక్కసారిగా దాడి చేసింది. మత్తుమందు ఇచ్చే సమయంలో జరిగిన ఈ ఘటనలో ఓ అధికారి గాయపడ్డారు. చిరుతను అనంతరం సురక్షితంగా బంధించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కర్ణాటకలోని బెలగావిలో సండే పార్టీ సందర్భంగా చికెన్ ముక్కల విషయంలో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ దారుణ హత్యకు దారితీసింది. ఎక్కువ చికెన్ తింటున్నాడని ఆగ్రహించిన సీతారామ్‌తో గొడవపడిన అరుణ్.. వంట కత్తితో అతడి ఛాతిలో పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారామ్ మృతి చెందాడు.
నేపాల్ వరదల్లో చిక్కుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ 28 మంది కైలాస్ మానస సరోవర్ యాత్రికులు శనివారం స్వస్థలాలకు చేరుకున్నారు. కేవలం పది నిమిషాల ఆలస్యం, టీ తాగేందుకు తీసుకున్న చిన్న విరామం తమ ప్రాణాలను కాపాడాయని వారు తెలిపారు.
బెంగళూరులో ఈరోజు ఉదయం ఓ మహిళపై ఇద్దరు దుండగులు దాడి చేసి 25 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. దొడ్డబిదరకల్లు ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కాగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లైంగిక దాడి కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరు సెంట్రల్ జైలులో ఆయన వద్ద క్రైంబ్రాంచ్ అధికారులు స్మార్ట్‌ఫోన్, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. జైలులో నిషేధిత ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించినందుకు రేవణ్ణపై మరో కేసు నమోదైంది.
దర్శన్ అనుచరుడు, ఏ-14 నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించారు. రేణుకాస్వామిపై దాడి, మృతి, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం.
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో శుక్రవారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్విమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. A14 నిందితుడు, దర్శన్ సన్నిహితుడిగా చెబుతున్న ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించాడు. కేసులో తనకు తెలిసిన పూర్తి నిజాలను వెల్లడిస్తానని పేర్కొనడంతో దర్శన్‌కు కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశముందనే చర్చ జరుగుతోంది.
Mysuru Chamundi Jayanti | కొండపై కొలువైన శక్తి స్వరూపిణి చాముండేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలకు మైసూరు ముస్తాబైంది. ఈనెల 5న సప్తమి సందర్భంగా జరిగే ఉత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి తరలిరానున్న భక్తుల రాకతో చాముండి కొండ ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమాపై మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయడంతో ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇదే సమయంలో 'ది రాజాసాబ్' తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఈ సినిమా ఎంత కీలకమనే అంశం కూడా హాట్ టాపిక్‌గా మారింది.