ముంబైలోని ఓ ప్రముఖ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైసూర్ మసాలా దోశ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్.. రెండు, మూడు ముద్దలు తిన్న తర్వాత దోశలో చచ్చిన ఎలుక పిల్లను గుర్తించాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అతడు పోలీసులను ఆశ్రయించి హోటల్‌పై ఫిర్యాదు చేశాడు.
సొంత సోదరి రాధ తనపై దొంగతనం కేసు పెట్టడంపై నటి అంబిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి చెక్కులు దొంగతనం చేయలేదని స్పష్టం చేశారు. ఆ చెక్కులను రాధే తనకు ఇచ్చారని, అనంతరం పేమెంట్స్‌ను ఆమెనే బ్లాక్ చేశారని అంబిక తెలిపారు. ఆస్తులు, వ్యాపారం, బంగారు ఆభరణాల విషయంలో చాలాకాలంగా తమ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి దీపారాధన, మీనుట్టు, వేది వజిపాడు తదితర సేవల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ఎంపీ మల్లు రవి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు.
హైదరాబాద్ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ భవిష్యవాణి వినిపించారు. సమాజంలో పుణ్యం తగ్గి పాపం పెరుగుతోందని, ప్రజలు ఆచారాలు, సంప్రదాయాలను విస్మరిస్తే కుండపోత వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా అండమాన్‌లోని శ్రీ విజయపురంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ నిరసనల సందర్భంగా అరెస్టైన సీజేపీ కార్యకర్తలు, విద్యార్థుల విడుదలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో క్రిమినల్ కేసులు లేని వారిని విడుదల చేయాలని, నిరసనలకు సంబంధించిన ఆధారాలను భద్రపరచాలని రాష్ట్రాలను ఆదేశించింది.
సుదీర్ఘ నిరాహార దీక్ష విరమణ అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన తన తదుపరి కార్యాచరణను వెల్లడించారు.
వర్షం కురుస్తోంది.. పోలీస్ వ్యాన్ ముందుకు దూసుకెళ్తోంది.. అందరూ చూస్తుండగానే ఓ యువతి ఒక్కసారిగా వ్యాన్‌కు అడ్డంగా నిలిచింది. కొద్ది క్షణాల్లోనే ఆ దృశ్యం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. NEET-UG 2026 పేపర్ లీక్ నిరసనల్లో కనిపించిన ఆ యువతి ఎవరు? ఎందుకు అలా చేసింది? ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ వెతుకుతున్న పేరు రియా అహిర్.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఇది దేశ యువత, కోట్లాది మంది విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమని ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. విద్యార్థుల గళం ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచాల్సి వచ్చిందని వారు వ్యాఖ్యానించారు.
రాజీనామా చేసిన వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నీట్ వివాదం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చివరకు ఎందుకు పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలను ఆయన ఆ లేఖలో స్పష్టంగా వివరించారు.
కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, "బొద్దింకల శక్తి ఏంటో ఇప్పుడు దేశానికి అర్థమైంది" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థుల పోరాటానికి ఇది తొలి విజయమని పేర్కొంటూ, ప్రజల ఒత్తిడిని ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయలేదని అన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి శనివారం రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధానంగా మూడు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. అందులో ప్రదానమైంది విద్యా శాఖ మంత్రి రాజీనామా.
దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలతో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.