సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ ట్రైలర్ విడుదలైంది. ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. యాక్షన్, వయలెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, భారీ ఎలివేషన్స్‌తో ఉన్న ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది.
ముంబైలోని IIT బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడ్ ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరీక్షలో మొబైల్ ఫోన్, చాట్‌జీపీటీ వినియోగం వ్యవహారం తర్వాత సాహిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కుమారుడిని ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల వేధించారని, కుల వివక్షకు గురి చేశారని సాహిల్ తండ్రి ఆరోపించారు. దీంతో విద్యార్థులు మూడు రోజులుగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు పెట్టిన 18 డిమాండ్లపై IIT బాంబే డైరెక్టర్ అంగీకారం తెలిపారు. దూళ్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆయనపై సంస్థ చర్యలు చేపట్టింది.
Saturn Aspect | గ్రహాల రాశి మార్పులు, వాటి దృష్టి ఆధారంగా జ్యోతిష్యంలో వివిధ యోగాలు ఏర్పడుతాయి. గ్రహాల కలయికతో కొన్ని సందర్భాల్లో శుభ యోగాలు, మరికొన్ని సందర్భాల్లో ప్రతికూల యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు.
Samasaptak Yogam | వేద జ్యోతిష్యంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా.. శనిని కర్మ, న్యాయానికి కారకుడిగా భావిస్తారు. పురాణాల ప్రకారం సూర్యుడు, శని తండ్రీకొడుకులు. వీరిద్దరి స్వభావాల్లో భారీగా తేడాలు ఉండడంతో శత్రుగ్రహాలుగా పేర్కొంటారు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఏడో స్థానంలో ఉన్నప్పుడు సమసప్తక యోగం ఏర్పడుతుంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. 2006లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న ఈ జంట.. రెండు దశాబ్దాల తర్వాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన జ్యోతిక.. తమ 20 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగపూరితమైన సుదీర్ఘ పోస్ట్ చేశారు.
జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. క్రిమినల్ నేపథ్యం ఉన్నవారికి సంబంధించిన కేసును మాత్రం కొనసాగించేందుకు అనుమతించింది. కోర్టు ఆదేశాలతో సంతృప్తి చెందిన సీజేపీ.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన భారీ మార్చ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఫ్రెష్ బస్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం ధాటికి బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేసినట్లు తెలుస్తోంది.
లిఫ్ట్‌లోంచి బయటకు వస్తుండగానే ఊహించని ప్రమాదం.. 50 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మార్కెట్ సెంటర్‌లోని సాయి సూర్య అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రముఖులు, ఆత్మీయులు, సినీ మిత్రులకు బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. వేడుకలో ఏవైనా లోటుపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని కోరుతూ ఆయన చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్‌గా మారింది.
బండ్ల గణేష్ కుమార్తె జనని, సూర్యతేజ వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
ములుగు ప్రీమియర్ లీగ్ పేరుతో బెట్టింగ్‌లు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత వై. సతీష్ రెడ్డి ఆరోపించారు. మంత్రి సీతక్క కుమారుడు సూర్యపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో బోనాల ఊరేగింపు సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ యువజన కార్యకర్తపై కొందరు కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
నల్సార్ విద్యార్థుల నిరసన వ్యవహారంలో బీసీఐ జోక్యంపై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది విద్యార్థులకు, నాకు మధ్య విషయం.. జోక్యం చేసుకునే హక్కు మీకేం ఉంది?” అని ప్రశ్నించారు.
సూర్య హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాకు ప్రివ్యూ షో పడటంతో ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది. సినిమా చూసిన వారి నుంచి ప్రాథమికంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుందని టాక్ వినిపిస్తున్నా.. ఇంటర్వెల్ తర్వాత కథలో వేగం పెరిగి ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ముఖ్యంగా సూర్య, మమితా బైజు కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని ప్రివ్యూ టాక్ చెబుతోంది.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన 'పోలీస్ ప్రజా భరోసా' కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ ప్రజలకు భద్రత, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, మహిళల రక్షణపై అవగాహన కల్పించారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో వృద్ధుల భద్రత కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ సిటిజన్ భద్రత కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.