హైదరాబాద్‌లో జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో ఓ డ్యాన్స్ బృందం చేసిన డ్యాన్స్ తీవ్ర కలకలం రేపింది. విశాఖకు చెందిన డ్యాన్స్ టీమ్‌లో ఓ యువతి మెడలో ఇండియన్ రాక్ పైథాన్‌ను వేసుకుని డ్యాన్స్ చేసింది. ఘటనపై సమాచారం అందుకున్న GHSPCA బృందం సుమారు ఐదు రోజుల పాటు బృందాన్ని ట్రాక్ చేసి, మధురానగర్ పోలీసుల సహకారంతో వారిని గుర్తించింది. అనంతరం కొండచిలువను స్వాధీనం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కన్నుమూశారు. మంగళవారం విశాఖపట్నంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో రాఖీ పర్వదినాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో ఓ ఆటో డ్రైవర్ కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పోలీసులు ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో.. వినోద్ కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు అసలు కారణమేంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్‌లోని లిటిల్ గార్డెన్స్ స్కూలులో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల ప్రణయ్ తేజ తరగతి గదిలోనే కుప్పకూలి మృతి చెందాడు. హోం వర్క్ చేయలేదనే కారణంతో టీచర్ కొట్టడంతోనే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి మృతికి అసలు కారణమేంటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఆక్సిజన్‌లా నిలిచారని, అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్ వంటి కీలక అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోదీ నెరవేరుస్తున్నారని, దేశాన్ని వికసిత్ భారత్ దిశగా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ కొత్త అధ్యాయమని అన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మోదీ రెక్కలు ఇచ్చారని, ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడింది కూడా మోదీనే అని వ్యాఖ్యానించారు.
చాలా కాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ప్రజాస్వామ్య విరుద్ధమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తనను కూడా పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకున్నారని, ఈ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.