కృష్ణా జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం పేరుతో మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ కనిపించకుండా తిరుగుతున్న భర్త.. చివరకు తన కాలనీలోని ఓ ఇంట్లో మరో మహిళతో ఉండగా భార్యకు కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య, కుమారుడితో కలిసి అతడిపై దాడి చేసి పోలీసులకు అప్పగించింది.
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. పురుగుల మందు కలిపిన మద్యం తాగించి హత్య చేసిన అనంతరం.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారు. అయితే మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కేసు విచారణ కోసం కోర్టుకు వచ్చిన మహిళపై ఆమె భర్త పోలీసు, లాయర్ల సమక్షంలోనే దాడికి పాల్పడ్డాడు. జుట్టు పట్టుకుని కిందపడేసి కొట్టడంతో పాటు గొంతు నులిమాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెంగళూరులో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ఖాళీ ప్రదేశంలో పడివున్న పాత పరుపును తరలించేందుకు ప్రయత్నించిన కార్మికులకు అందులోంచి ఓ కాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో అది 28 ఏళ్ల అనుసూయ మృతదేహంగా గుర్తించారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం కొంతకాలంగా భార్యను వేధిస్తున్న ఓ వ్యక్తి.. కుటుంబ వివాదంలో ఆమె తండ్రిపై దాడికి యత్నించాడు. తండ్రిని కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన భార్యపై తీవ్ర ఆగ్రహంతో దాడి చేసి, ఆమె ముక్కును దంతాలతో కొరికేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాధారణంగా భార్య మరొకరితో వెళ్లిపోయిందని తెలిస్తే భర్త ఆగ్రహానికి గురవుతాడు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు.
హర్యానాలోని కురుక్షేత్రలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసిన ఓ మహిళ.. మృతదేహం పొట్టను కోసి పేగులు బయటకు తీసింది. శరీరంలోని కొన్ని అవయవాలు కూడా కనిపించకుండా పోయాయి. ఈ దారుణాన్ని ఇంటి యజమాని గుర్తించడంతో నిందితురాలు టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మూఢనమ్మకాలు, భూతవైద్యం కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ అనంతరం వచ్చే డబ్బులు, ఆస్తి పంపకాల విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి గురైన భార్య రోకలిబండతో భర్త తలపై దాడి చేయడంతో ఆయన మృతి చెందారు.
మొదటి భార్యకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. అలాంటి ఉద్యోగుల జీతంలో 20 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని మొదటి భార్య బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు.
యాక్సిడెంట్ చేయించి నా భర్తను చంపించు.. లేదంటే నేనే చస్తా అంటూ ప్రియుడితో ఓ భార్య చేసిన చాటింగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో భర్తను చంపేందుకు ఆమె చేసిన కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టిన ప్రదీప్ రావత్.. నిజ జీవితంలో మాత్రం ఎంతో ప్రశాంతమైన వ్యక్తి. ఆయన మరణంతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఆయన భార్య కళ్యాణి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? వారి కుటుంబ జీవితం ఎలా ఉండేది? అనే విషయాలపై ఆసక్తి పెరిగింది.
పవన్ కళ్యాణ్ రాజకీయ, సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన కుటుంబం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే ఆయన సతీమణి అన్నా లెజినోవా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. రష్యన్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అన్నా.. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే తన వ్యక్తిగత విజయాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె జీవితం, ఆస్తులు, పవన్ కళ్యాణ్‌కు అండగా నిలిచిన ప్రయాణం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.