తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తారనే ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పాలిటెక్నిక్ కాలేజీలు 100 శాతం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను ఆధునిక నైపుణ్యాలతో అనుసంధానించేందుకే సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్‌లను టాటా టెక్నాలజీస్ సహకారంతో రూ.4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న జీవో 97ను రద్దు చేయాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.
సిద్దిపేట శ్రీకృప ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజీకి చెందిన బి.ఫార్మసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎం.ఫార్మసీ కౌన్సిలింగ్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వేలాది విద్యాసంస్థలు బకాయిల కారణంగా సంక్షోభంలో ఉంటే.. విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ స్కీమ్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ సమీపంలో నిర్వహించిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఇకపై ముందుగానే విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏటా రూ.2,400 కోట్లు అందించి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు.
అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులు, పీపీపీ విధానం తదితర అంశాలపై గట్టిగా పోరాడాలని సూచించారు.
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రూ.10,814 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను వెంటనే విడుదల చేయాలని SFI డిమాండ్ చేసింది. విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేస్తున్న ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆగస్టు 13న కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చింది.
బీసీల సమస్యల పరిష్కారం, కులగణన తదుపరి ప్రక్రియ, సంక్షేమ పథకాల అమలు, ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై హైదరాబాద్‌లో బీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పూలే దంపతులు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రశ్నపత్రాల లీకేజీలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పనిసరి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రశ్నపత్రాల లీకేజీలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపించిన ఆయన, గతంలో గ్లోబరీనా వంటి సంస్థలపై తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఆ అక్రమాలు సీబీఎస్ఈ పరీక్షల వరకు విస్తరించాయని విమర్శించారు.
పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా ABVP ఆధ్వర్యంలో జులై 30వ తేదీన హన్మకొండలో తలపెట్టిన స్టూడెంట్ మార్చ్.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోగా బకాయిలు చెల్లించకపోతే వేలాది మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ నిర్వహించి మిలియన్ మార్చ్ చేపడతామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షల నిర్వహణ నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వరకు పలు అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఉద్యమ ఫలితాన్ని తమ విజయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సరికాదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. విమర్శలు చేసే ముందు కొన్ని కీలక ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.