తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 544 అధ్యాపక, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కొత్త ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంపిక విధానంలో మార్పులు చేయనున్నారు. అకడమిక్ ప్రతిభకు 50 మార్కులు, రాత పరీక్షకు 40, ఇంటర్వ్యూకు 10 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులతో ఎంపిక చేపట్టే అవకాశం ఉంది.
కరీంనగర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ యువభేరి సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. యువతకు ఉద్యోగాలు, నోటిఫికేషన్లు లేవని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీశారు. ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్నారని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని, 1000 రోజుల పాలనే తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త. జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 125 అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు...
10వ తరగతి పాసైన వారికి పోస్టల్ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి 23,757 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 419, ఆంధ్రప్రదేశ్‌లో 918 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
హనుమకొండలో ఆర్టీసీ కాంట్రాక్ట్ కండక్టర్లు ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వరంగల్ రీజియన్‌లో పనిచేస్తున్న సుమారు 90 మంది కండక్టర్లను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. వెంటనే తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఏ ఉద్యోగ ఖాళీని కూడా నిర్లక్ష్యం చేయబోమని స్పష్టం చేశారు.
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్ శాఖలోని పలు ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఉన్న ఐదేళ్ల సడలింపుతో కలిపి మొత్తం ఏడేళ్ల వరకు వయోపరిమితి రిలాక్సేషన్ లభించనుంది.
డిగ్రీ ఒక్కటే ఉద్యోగానికి సరిపోదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని యువతకు సూచించారు.
హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. వేలాది మంది అభ్యర్థులు తెల్లవారుజామున నుంచే స్టేడియానికి చేరుకోవడంతో తోపులాట జరిగింది.
హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలో ఉన్న ప్రముఖ రక్షణ, ఏరోస్పేస్ తయారీ సంస్థ VEM Technologies పలు విభాగాల్లో అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. CNC ఆపరేటర్లు, వెల్డర్లు, క్వాలిటీ ఇన్‌స్పెక్టర్లు, CG ఆపరేటర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. నెలకు రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం అందించే అవకాశం ఉంది.
ITI పూర్తి చేసిన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు మెధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,775 మంది విద్యార్థులకు ఉద్యోగాలు.
ఆఫర్ లెటర్లు పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు.
జర్మన్, జపనీస్ తదితర భాషల శిక్షణ కోసం EFLUతో కీలక ఒప్పందం.
తెలంగాణను దేశంలోనే నంబర్-1 స్కిల్ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం.