ఏపీ సీఎం చంద్రబాబు ఆకస్మిక పర్యటన.. పీహెచ్‌సీలో 'సంజీవని' అమలుపై ఆరా

ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. సంజీవని ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించిన ఆయన, డిజిటల్ సాంకేతికతతో ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.

25 జులై, 2026 11:59 PM•ByLaharika

Share this article

ఏపీ సీఎం చంద్రబాబు ఆకస్మిక పర్యటన.. పీహెచ్‌సీలో 'సంజీవని' అమలుపై ఆరా

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్టు పురోగతిని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ ఆరోగ్య సేవల విధానంలో భాగంగా అమలవుతున్న సంజీవని ప్రాజెక్టుపై వైద్యాధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. డిజిటల్ విధానంలో వ్యక్తిగత ఆరోగ్య రికార్డులను అనుసంధానించి ప్రజలకు ఆరోగ్య సేవలు ఎలా అందిస్తున్నారో పరిశీలించారు.

డిజిటల్ టెక్నాలజీ ద్వారా రోగుల సమాచారం నిర్వహణ, ఫాలోఅప్, వ్యాధుల ముందస్తు గుర్తింపు, కౌన్సెలింగ్, కుటుంబ సభ్యుల భాగస్వామ్యం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంజీవని అమలుకు ముందు, తర్వాత వచ్చిన మార్పులపై కూడా వైద్యులతో చర్చించారు.

ఈ సందర్భంగా వీ-పాడ్ (V-Pod) వ్యవస్థ ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల సహకారంతో ఒక హైరిస్క్ గర్భిణికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచే విజయవంతంగా ప్రసవం నిర్వహించిన విషయాన్ని వైద్యాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, సకాలంలో నిర్ణయం తీసుకుని తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడిన వైద్య బృందాన్ని అభినందించారు.

అనంతరం పీహెచ్‌సీకి వచ్చిన కొందరు దంపతులతో సీఎం మాట్లాడారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకుని మహిళలకు గర్భధారణ సమయంలో అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పర్యవేక్షణ, ఫాలోఅప్ విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు.

గర్భిణులు తమకు అందిన వైద్య సేవలు, క్రమం తప్పకుండా జరిగిన హెల్త్ ఫాలోఅప్ గురించి సీఎంకు వివరించారు. వ్యాధుల ట్రాకింగ్, వైద్య పరీక్షల రిమైండర్లు, ఆరోగ్య నివేదికలను డిజిటల్ రూపంలో అందించే విధానాన్ని అధికారులు సీఎంకు వివరించారు.

సంజీవని ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

▶CategoriesAndhra-pradesh and News
▶Follow us onFacebook, Twitter & Instagram.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు