ఈ నటి ముత్తాత ఒక ప్రధాన మంత్రి.. తాత గవర్నర్.. కట్ చేస్తే, పెళ్లి మాత్రం టాలీవుడ్ హీరోను చేసుకుంది..!

సినిమాల్లో రాజకుటుంబాలకు చెందిన పాత్రల్లో ఎంతో హుందాగా కనిపించే ఈ స్టార్ హీరోయిన్.. నిజ జీవితంలోనూ అదే రాజ వంశానికి చెందిన వారసురాలు కావడం చాలా మందికి తెలియదు. అందం, అభినయంతో టాలీవుడ్, బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె కుటుంబ నేపథ్యం ఎంతో గొప్పది. హైదరాబాద్ హైదరి కుటుంబంతో పాటు తెలంగాణలోని వనపర్తి సంస్థానంతో ఉన్న అనుబంధం ఆమెను ఇతర హీరోయిన్లతో పోలిస్తే మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది.

3 ఆగస్టు, 2026 11:35 PM•ByLaharika

Share this article

ఈ నటి ముత్తాత ఒక ప్రధాన మంత్రి.. తాత గవర్నర్.. కట్ చేస్తే, పెళ్లి మాత్రం టాలీవుడ్ హీరోను చేసుకుంది..!

సినిమాల్లో రాజులు, రాణుల పాత్రల్లో కనిపించే నటీనటులు నిజ జీవితంలో కూడా రాజ కుటుంబాలకు చెందిన వారసులే అయితే ఎలా ఉంటుంది? బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అదితి రావు హైదరి అలాంటి అరుదైన నటీమణుల్లో ఒకరు. తెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ ఆమె రాజ వంశానికి చెందిన వారసురాలు కావడం చాలా మందికి తెలియని విషయం. 1986 అక్టోబర్ 28న హైదరాబాద్‌లో జన్మించిన అదితి.. ఒకవైపు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ హైదరి కుటుంబానికి, మరోవైపు తెలంగాణలోని వనపర్తి సంస్థాన రాజ కుటుంబానికి వారసురాలు. ఆమె ముత్తాత సర్ అక్బర్ హైదరి హైదరాబాద్ సంస్థాన ప్రధానమంత్రిగా పనిచేయగా, తాత మహ్మద్ సలేహ్ అక్బర్ హైదరి అస్సాం గవర్నర్‌గా సేవలందించారు. తల్లి వైపు తాత జె. రామేశ్వర్ రావు వనపర్తి సంస్థానాధీశుడు.

అదితి సినీ ప్రయాణం మలయాళ చిత్రం 'ప్రజాపతి'తో ప్రారంభమైంది. అనంతరం 'ఢిల్లీ-6'తో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. మొదట చిన్న పాత్రలతోనే కెరీర్ ప్రారంభించిన ఆమె.. 'యే సాలీ జిందగీ', 'రాక్‌స్టార్', 'మర్డర్ 3', 'ఫితూర్' వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. అయితే ఆమెకు నిజమైన ప్రత్యేకత తెచ్చిపెట్టింది చారిత్రక పాత్రలే. పాతకాలపు రాణులు, రాజకుటుంబాలకు చెందిన మహిళల పాత్రల్లో ఆమె చూపించిన హావభావాలు, హుందాతనం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

2018లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావత్' సినిమాలో మెహరున్నీసా పాత్రలో అదితి నటనకు విశేష ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 2023లో వచ్చిన 'తాజ్: డివైడెడ్ బై బ్లడ్' వెబ్‌సిరీస్‌లో అనార్కలి పాత్రలో మరోసారి తన నటనతో మెప్పించింది. రాజకుటుంబ నేపథ్యం ఉండటంతో పాటు ఆ పాత్రలకు అవసరమైన హావభావాలను సహజంగా పలికించగలగడం ఆమెకు మరింత ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అందుకే చారిత్రక కథల్లో ఆమె పేరు దర్శకుల తొలి ఎంపికల్లో ఒకటిగా మారింది.

వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. అదితి ముందుగా నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోయింది. అనంతరం 2024లో టాలీవుడ్ హీరో సిద్ధార్థ్‌ను పెళ్లి చేసుకుంది. కాగా.. వీరిద్దరికి ఇది సెకండ్ మ్యారేజ్ కావడం విశేషం. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ శ్రీ రంగనాథస్వామి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వనపర్తి సంస్థాన వారసురాలైన అదితి తన కుటుంబానికి చారిత్రక అనుబంధం ఉన్న ఆలయంలోనే పెళ్లి చేసుకోవడం అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు