పోలీస్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.

4 ఆగస్టు, 2026 10:15 PM•ByRalin

Share this article

పోలీస్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 4 (జనవాణి): రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ మేరకు 7,437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే వర్గాలు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు నివేదించడంతో సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు.

డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో నియామక ప్రక్రియలో ప్రతి దశను కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, ముద్రణ, రవాణా నుంచి పరీక్షల నిర్వహణ వరకు అన్ని దశల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు కోచింగ్ సెంటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై చర్యలు

పోలీస్ నియామక పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియా, ఇతర వేదికల్లో తప్పుడు ప్రచారం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు, నకిలీ సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. పరీక్షల ప్రక్రియ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తి అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

సమావేశంలో సీఎం ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్, తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

▶CategoriesNews, Telangana and Jobs
▶Follow us onFacebook, Twitter & Instagram.
Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు