#Aviation News

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Aviation News.

13 Stories

Stories tagged with #Aviation News

తల వెనకాల పగులు.. చూపు ఇంకా పూర్తిగా రాలేదు..అయినా వెనక్కి తగ్గని పైలట్ స్మిత్ మచ్చర్
international,news,aviation-air-travel

తల వెనకాల పగులు.. చూపు ఇంకా పూర్తిగా రాలేదు..అయినా వెనక్కి తగ్గని పైలట్ స్మిత్ మచ్చర్

ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ గొడ్డలితో చేసిన దాడిలో తీవ్రంగా గాయపడినా.. విమానాన్ని అదుపులో ఉంచి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు పుర్రెలో తీవ్ర ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అబుధాబిలో చికిత్స పొందుతున్న ఆయన వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు.

6 అక్టో, 20262 min read
Flydubai Co-Pilot Hamam al-Hammami
aviation-air-travel,international,news

ప్రతీకారం కోసమే..9/11 తరహాలో విమానంతో దాడి.. విచారణలో ఫ్లైదుబాయ్ కో-పైలట్ సంచలన వెల్లడి!

ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒమన్ జాతీయుడు, కో పైలట్ హమామ్ అల్-హమ్మామి విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఫ్లైదుబాయ్‌లో చేరకముందే దాడికి ప్రణాళిక రచించినట్లు, గాజాపై దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడాలని భావించినట్లు దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం.

6 అక్టో, 20262 min read
ఫ్లైదుబాయ్‌ను కూల్చేందుకు ఇజ్రాయెల్ ప్లాన్!
aviation-air-travel,crime,international,news

ఫ్లైదుబాయ్‌ను కూల్చేందుకు ఇజ్రాయెల్ ప్లాన్!

ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న హైజాక్ ప్రయత్నం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. విమానం టెల్ అవీవ్ వైపు దూసుకొస్తుండటంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైందని, అవసరమైతే విమానాన్ని కూల్చివేయాలని కూడా ఒక దశలో నిర్ణయించినట్టు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ప్రయాణికులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు విమానం సౌదీ వైపు మళ్లడంతో ఇజ్రాయెల్ ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్టు సమాచారం.

6 అక్టో, 20262 min read
పైలట్‌ను హతమార్చి విమానాన్ని కూల్చేయాలని ప్లాన్.. ఫ్లైదుబాయ్ ఘటనలో షాకింగ్ వివరాలు
aviation-air-travel,international,news

పైలట్‌ను హతమార్చి విమానాన్ని కూల్చేయాలని ప్లాన్.. ఫ్లైదుబాయ్ ఘటనలో షాకింగ్ వివరాలు

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు హీబ్రూ మీడియా కథనాలు వెల్లడించాయి. పైలట్‌ను హతమార్చిన తర్వాత విమానాన్ని బెన్ గురియన్ విమానాశ్రయంలోని భవనం లేదా జెట్‌పై ఢీకొట్టాలని కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి భావించినట్టు దర్యాప్తు అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.

5 అక్టో, 20262 min read
ఫ్లైదుబాయ్ విమానంలో ఉగ్ర కుట్ర.. కో-పైలట్ దాడి వెనుక సంచలన విషయాలు
crime,international,news,national

ఫ్లైదుబాయ్ విమానంలో ఉగ్ర కుట్ర.. కో-పైలట్ దాడి వెనుక సంచలన విషయాలు

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ జరిపిన దాడిని యూఏఈ ప్రాసిక్యూటర్లు ఉగ్రవాద చర్యగా ధృవీకరించారు. విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని కూల్చివేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.

3 అక్టో, 20262 min read
హనుమాన్ చాలీసా చదివా.. ధైర్యం వచ్చింది.. ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ కెప్టెన్ ఆసక్తికర సంభాషణ
aviation-air-travel,india,national,news

హనుమాన్ చాలీసా చదివా.. ధైర్యం వచ్చింది.. ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ కెప్టెన్ ఆసక్తికర సంభాషణ

ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ దాడికి గురైనప్పటికీ 173 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్‌లో మాట్లాడారు. తీవ్ర గాయాలతోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించిన కెప్టెన్ ధైర్యాన్ని ప్రధాని ప్రశంసించారు. ఘటన సమయంలో హనుమాన్ చాలీసా జపించానని కెప్టెన్ స్మిత్ తెలిపారు.

2 అక్టో, 20262 min read
 దుబాయ్‌ విమానం దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ స్మిత్‌.. అత్యవసర చికిత్స చేసిన డెంటిస్ట్‌
international,india,national,news

దుబాయ్‌ విమానం దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ స్మిత్‌.. అత్యవసర చికిత్స చేసిన డెంటిస్ట్‌

ఫ్లై దుబాయ్‌ విమానంలో జరిగిన కాక్‌పిట్‌ దాడి తీవ్ర కలకలం రేపింది. దాడిలో భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ తీవ్రంగా గాయపడి భారీగా రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయే పరిస్థితికి చేరుకున్నారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇజ్రాయెల్‌ దంత వైద్యుడు డాక్టర్‌ షోటా మొసావ్‌ వెంటనే కాక్‌పిట్‌లోకి వెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన సకాలంలో స్పందించడం పైలట్‌ ప్రాణాలను కాపాడడంలో కీలకంగా మారింది.

1 అక్టో, 20262 min read
Social Media Image
international,news,national

కత్తిపోట్లతో గాయపడినా పోరాడిన కెప్టెన్‌.. 180 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్

దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సహ పైలట్ దాడి చేసినప్పటికీ భారతీయ కెప్టెన్ ప్రాణాలకు తెగించి అతడిని ఎదుర్కొన్నారు. అదే సమయంలో విమానంపై నియంత్రణ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుని సుమారు 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థలు వెల్లడించాయి.

30 సెప్టెం, 20261 min read
విమానంలో పైలట్ల ఫైటింగ్‌.. 33 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా 17 వేల అడుగులకు!
international,news

విమానంలో పైలట్ల ఫైటింగ్‌.. 33 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా 17 వేల అడుగులకు!

దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్‌ విమానంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ జరగడంతో విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెలువడ్డాయి. దీంతో హైజాక్‌ అనుమానాలు తలెత్తగా చివరకు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌ విమానాశ్రయానికి మళ్లించారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.

30 సెప్టెం, 20261 min read
Social Media Image
international,news

దుబాయ్ విమానంలో హైజాక్ అలర్ట్..ఫైటర్ జెట్ల రంగప్రవేశం!

దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో హైజాక్‌ అలర్ట్‌ కలకలం రేపింది. సౌదీ అరేబియా గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం నుంచి రెండు అత్యవసర సంకేతాలు వెలువడినట్లు ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు తెలిపాయి. దీంతో ఇజ్రాయెల్‌ అధికారులు అప్రమత్తమై ఫైటర్‌ జెట్లను రంగంలోకి దించారు. విమానాన్ని సౌదీ అరేబియా వైపు మళ్లించినట్లు సమాచారం.

30 సెప్టెం, 20261 min read
పూణేలో శిక్షణ విమానానికి ప్రమాదం.. రన్‌వే దాటి వెళ్లిన ఎయిర్‌క్రాఫ్ట్
national,india,news

పూణేలో శిక్షణ విమానానికి ప్రమాదం.. రన్‌వే దాటి వెళ్లిన ఎయిర్‌క్రాఫ్ట్

పూణే జిల్లా బరామతి ఎయిర్‌ఫీల్డ్‌లో శిక్షణ విమానం రన్‌వేను దాటి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. కెప్టెన్, క్యాడెట్ సురక్షితంగా బయటపడగా ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

9 ఆగ, 20261 min read
Image Source : Social Media
international,national,india,news

ఎయిర్ ఇండియా విమాన ఘటనలో సంచలనం.. డ్రగ్ టెస్ట్‌లో పైలట్ పాజిటివ్?

ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన ఘటనలో కొత్త మలుపు. తీవ్ర కుదుపుల అనంతరం నిర్వహించిన డ్రగ్ పరీక్షలో ఓ పైలట్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. డీజీసీఏ విచారణ కొనసాగుతోంది.

9 ఆగ, 20262 min read
ANI Image
international,national,news

ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం.. ఒక్కసారిగా 300 అడుగులు కిందికి పడిపోయిన AI-2379

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-2379 విమానం తీవ్ర టర్బులెన్స్‌కు గురైంది. విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందికి పడిపోవడంతో 10 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. ఢిల్లీ IGI విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

4 ఆగ, 20261 min read