హైదరాబాద్ గణేశ్ నిమజ్జన వేడుకల్లో భక్తి, సందడి నడుమ పోలీసుల సరదా డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. గణేష్ నిమజ్జనం సందర్భంగా కొందరు పోలీసులు డ్యాన్స్ స్టెప్పులతో సందడి చేయగా ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పెళ్లి, పండుగ, వేడుకల్లో డప్పుల దరువు వినిపిస్తే సందడి మామూలుగా ఉండదు. అలాంటి మాస్ బీట్‌కు ఓ రోబోట్ మనుషుల్లా స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. చేతులు, కాళ్లు, నడుము కదుపుతూ డ్రమ్స్ మ్యూజిక్ తగ్గట్టుగా డ్యాన్స్ చేసిన ఈ రోబోట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లో జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో ఓ డ్యాన్స్ బృందం చేసిన డ్యాన్స్ తీవ్ర కలకలం రేపింది. విశాఖకు చెందిన డ్యాన్స్ టీమ్‌లో ఓ యువతి మెడలో ఇండియన్ రాక్ పైథాన్‌ను వేసుకుని డ్యాన్స్ చేసింది. ఘటనపై సమాచారం అందుకున్న GHSPCA బృందం సుమారు ఐదు రోజుల పాటు బృందాన్ని ట్రాక్ చేసి, మధురానగర్ పోలీసుల సహకారంతో వారిని గుర్తించింది. అనంతరం కొండచిలువను స్వాధీనం చేసుకుంది.
ప్లాస్టిక్ కుర్చీ మన్నికను కస్టమర్లకు చూపించేందుకు ఓ విక్రయదారుడు చేసిన వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా కుర్చీలను నేలకేసి కొట్టడం, వంచడం వంటి స్టంట్లు చేసే విక్రయదారులు కనిపిస్తుంటారు. కానీ ఇతడు ఏకంగా కుర్చీపై నిలబడి డ్యాన్స్ చేస్తూ దాని బలాన్ని ప్రదర్శించాడు.
ముఖేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అంబానీ కోడలు రాధిక మర్చంట్ ‘ఏకదంతాయ వక్రతుండాయ’ పాటకు చేసిన అద్భుత నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘ఢీ’ డ్యాన్స్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్, ‘ఢీ-20’ విన్నర్ రాజు అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకుని, వివిధ అవసరాల పేరుతో సుమారు రూ.12 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘క్రేజీ కళ్యాణం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘కాకా ధూమ్ ధమాకా’ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. పెళ్లి కూతురు గెటప్‌లో అనుపమ వేసిన మాస్ స్టెప్పులు ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఫోక్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు గుర్తించి కాపాడినట్లు తెలుస్తోంది.
యాంకర్ అనసూయ భరద్వాజ్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ, డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. స్పీడ్‌గా ఎక్సర్‌సైజులు చేస్తూ కనిపించిన ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీడియోలో ఆమె ధరించిన దుస్తులపై కొందరు నెటిజన్లు విమర్శలు, ట్రోలింగ్‌కు దిగారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేల హాజరుపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సభ్యుడి సీటు వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి, సభ్యుడు తన స్థానంలో కూర్చుంటేనే హాజరుగా పరిగణిస్తామని ప్రకటించారు. సభకు రాకుండా కేవలం రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లిపోవడాన్ని అరికట్టడమే ఈ నిర్ణయ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇంజినీరింగ్‌లో సీటు రాలేదని ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇది శుభవార్త. భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, స్మార్ట్ ఫార్మింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను బోధించే B.Sc Agritech (Hons.) కోర్సు ఇప్పుడు విద్యార్థులకు కొత్త కెరీర్ అవకాశాలను అందిస్తోంది. ముఖ్యంగా ఎంసెట్ ర్యాంక్‌తో సంబంధం లేకుండానే ఈ కోర్సులో చేరే అవకాశం ఉండటం విశేషం.