బాలానగర్‌లో న్యూ మారుతి సుజుకి బ్రెజ్జా గ్రాండ్ లాంచ్.. ముఖ్య అతిథిగా బండి రమేష్

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో మారుతి సుజుకి వరుణ్ మోటార్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ది న్యూ బ్రెజ్జా – కింగ్ ఆఫ్ SUVs" గ్రాండ్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై నూతన బ్రెజ్జా కారును ఆవిష్కరించారు.

27 జులై, 2026 3:24 PM•ByLaharika

Share this article

బాలానగర్‌లో న్యూ మారుతి సుజుకి బ్రెజ్జా గ్రాండ్ లాంచ్.. ముఖ్య అతిథిగా బండి రమేష్

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో మారుతి సుజుకి వరుణ్ మోటార్స్ నిర్వహించిన "ది న్యూ బ్రెజ్జా – కింగ్ ఆఫ్ SUVs" గ్రాండ్ లాంచ్ కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ నూతన మారుతి సుజుకి బ్రెజ్జా కారును ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా షోరూమ్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి నాణ్యమైన ఉత్పత్తులు, విశ్వసనీయ సేవలతో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికత, మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధునాతన సౌకర్యాలతో రూపొందించిన న్యూ బ్రెజ్జా మార్కెట్లో మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మారుతి సుజుకి వరుణ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.సి. రాజు, జనరల్ మేనేజర్ కృష్ణ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆంజనేయులు, బ్రాంచ్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డితో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తూము వేణు, పుష్ప రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, గాలి బాలాజీ, కలికోట బాలరాజు, శివకుమార్, శ్రీకాంత్ పటేల్, గంధం రాజు, మధు, రాము, వాసు, క్రాంతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు