సైబర్ నేరాలపై భారీ ఆపరేషన్.. 100 మందికి పైగా ఏజెంట్లు అరెస్ట్

దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ నేరాల కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో దాదాపు రెండు వారాల పాటు నిర్వహించిన ప్రత్యేక సోదాల్లో మ్యూల్ ఖాతాలు, కేవైసీ పత్రాలు సమకూర్చుతున్న 100 మందికి పైగా ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

6 అక్టోబర్, 2026 8:43 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సైబర్ నేరాలపై భారీ ఆపరేషన్.. 100 మందికి పైగా ఏజెంట్లు అరెస్ట్

Social Media Image

హైదరాబాద్, అక్టోబర్ 6 (జనవాణి): దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ నేరాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో దాదాపు రెండు వారాల పాటు ప్రత్యేక సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సమకూర్చడంతో పాటు, కేవైసీ పత్రాలు అందిస్తున్న 100 మందికి పైగా ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మ్యూల్ ఖాతాలతో సైబర్ నేరాలు

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు, డెబిట్ కార్డులు, కేవైసీ పత్రాలు అందించి.. అక్రమ లావాదేవీలకు సహకరిస్తున్నట్టు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మ్యూల్ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా జరిగిన పలు సైబర్ నేరాలతో వీరికి సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

భారీగా డెబిట్ కార్డులు, పాస్‌బుక్‌లు స్వాధీనం

సోదాల్లో నిందితుల నుంచి మ్యూల్ ఖాతాలకు సంబంధించిన డెబిట్ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలు, వాటి వెనుక ఉన్న సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌కు తరలింపు

ఐదు రాష్ట్రాల్లో నిర్వహించిన సోదాల్లో అదుపులోకి తీసుకున్న నిందితులను మంగళవారం ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించనున్నారు. అనంతరం వారిని విచారించి, మ్యూల్ ఖాతాల వ్యవహారం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు, సైబర్ నేరాల నెట్‌వర్క్‌పై మరింత సమాచారం సేకరించనున్నట్లు తెలుస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు