గ్రేటర్ పీఠంపై గండ్ర జ్యోతి కన్ను?.. హనుమకొండకు ఓటు మార్పుతో మేయర్ రేసుపై చర్చ

గ్రేటర్ హనుమకొండ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. గండ్ర జ్యోతి మున్సిపల్ రాజకీయాలపై దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

28 జులై, 2026 3:59 PM•ByNarender Kumar Nangunoori

Share this article

గ్రేటర్ పీఠంపై గండ్ర జ్యోతి కన్ను?.. హనుమకొండకు ఓటు మార్పుతో మేయర్ రేసుపై చర్చ

హనుమకొండ, జులై 28: గ్రేటర్ వరంగల్ రాజకీయాల్లో మాజీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి గండ్ర జ్యోతి పేరు తాజాగా చర్చనీయాంశంగా మారింది.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా భూపాలపల్లి నుంచి ఇటీవల హనుమకొండకు ఓటు మార్పు చేసుకున్న గండ్ర జ్యోతి... గ్రేటర్ పరిధిలోని 7వ డివిజన్‌లో చురుకుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీంతో రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమె రాజకీయంగా గ్రౌండ్‌వర్క్ ప్రారంభించారనే చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున హనుమకొండ 7వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలపై ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా భవిష్యత్‌లో మేయర్ రేసులో నిలవాలనే లక్ష్యంతోనే ఈ రాజకీయ కసరత్తు జరుగుతోందా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు, ప్రజలతో మమేకం కావడం వంటి కార్యక్రమాలపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అయితే, గండ్ర జ్యోతి లేదా ఆమె పార్టీ నుంచి ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారంగా మాత్రమే ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు