హైదరాబాద్, జులై 28: ఐటీఐ/ఏటీసీలో మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 1, 2026 సాయంత్రం 5 గంటల తర్వాత వారి నమోదిత మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ (SMS) ద్వారా సమాచారం పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా కూడా సీట్ల కేటాయింపు వివరాలను చెక్ చేసుకోవచ్చు. సీటు కేటాయించబడిన విద్యార్థులు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసి, అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో కలిసి కేటాయించిన ప్రభుత్వ/ఏటీసీ లేదా ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో నిర్దేశిత గడువులోపు రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. గడువులోగా కళాశాలలో రిపోర్ట్ చేయని పక్షంలో, కేటాయించిన సీటు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కాబట్టి, ఐటీఐలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఎస్‌ఎంఎస్, అధికారిక వెబ్‌సైట్ (https:// www.iti.telangana.gov.in) మరియు తమ లాగిన్‌ను తప్పనిసరిగా పరిశీలిస్తూ తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.




















