కంటాయపాలెం–మడిపెళ్లి, గుర్తూరు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం.. అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు

తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో కొనసాగుతున్న కీలక వంతెన నిర్మాణ పనులను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశశ్విని రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.

27 జులై, 2026 6:05 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కంటాయపాలెం–మడిపెళ్లి, గుర్తూరు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం.. అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు

తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో కొనసాగుతున్న కీలక వంతెన నిర్మాణ పనులను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశశ్విని రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా రూ.3.30 కోట్ల వ్యయంతో కంటాయపాలెం–మడిపెళ్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన, అలాగే రూ.3.50 కోట్ల వ్యయంతో కంటాయపాలెం–గుర్తూరు గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన పనులను ఎమ్మెల్యే పరిశీలించి, నిర్మాణ ప్రక్రియపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి మాట్లాడుతూ, ఈ వంతెనలు పూర్తయిన తర్వాత గ్రామాల మధ్య రాకపోకలు మరింత వేగవంతం, సురక్షితంగా మారనున్నాయని తెలిపారు. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు సులభంగా తరలించేందుకు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు ఇబ్బందులు లేకుండా చేరుకునేందుకు, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వంటి సేవలు వేగంగా అందుబాటులోకి రావడానికి ఈ వంతెనలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారులు, వంతెనలు, తాగునీరు వంటి కీలక అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు కూడా వంతెనల నిర్మాణం పూర్తయితే దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు