కాజీపేట రైల్వే డివిజన్ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది – దాస్యం వినయ్ భాస్కర్

కాజీపేట రైల్వే డివిజన్ సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. జంతర్‌మంతర్‌లో ఈ నెల 30న బీఆర్ఎస్ నిర్వహించే ధర్నాకు పార్టీ శ్రేణులు ఢిల్లీకి తరలివెళ్లనున్నట్లు తెలిపారు.

28 జులై, 2026 12:02 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కాజీపేట రైల్వే డివిజన్ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది – దాస్యం వినయ్ భాస్కర్

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు బయలుదేరుతున్న పార్టీ శ్రేణులకు మంగళవారం ఉదయం కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆయన సంఘీభావం తెలిపారు.

ఈ సంద‌ర్భంగా దాస్యం విన‌య్ భాస్క‌ర్ గారు మాట్లాడుతూ... పోరాటాలు మా పంథా అని, హ‌క్కుల సాధ‌న కోసం నిరంత‌రం ఉద్య‌మిస్తామ‌ని అన్నారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం పోరాడిన విధంగా తెలంగాణ రాష్ట్ర హ‌క్కుల సాధ‌న‌కు ఉద్య‌మం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీగా మేము ఈ ప్రాంత ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు ప‌ని చేస్తున్నామ‌ని అన్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జ‌ల 40 ఏండ్ల కోచ్ ఫ్యాక్ట‌రీ క‌ల‌ను సాక‌రం చేసేందుకు పోరాడామ‌ని గుర్తు చేశారు. సాధించిన కోచ్ ఫ్యాక్ట‌రీలో స్థానికుల‌కే ఉద్యోగాలు ఇవ్వాల‌ని, కాజీపేట రైల్వే డివిజ‌న్ సాధన‌, భూమి ఇచ్చిన భూ బాధితుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు, లోకో పైలెట్లు, రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల సాధ‌న కోసం వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌వ‌ర్గ పార్టీ శ్రేణులతో క‌లిసి ఈ నెల 30న ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద శాంతియుత ధ‌ర్నా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

కార్య‌క్ర‌మంలో మాజీ కార్పొరేట‌ర్లు సంకు న‌ర్సింగ‌రావు, బొంగు అశోక్ యాద‌వ్‌, జోరిక ర‌మేష్‌, సీనియ‌ర్ నాయ‌కులు నార్ల‌గిరి ర‌మేష్, ఐన‌వోలు స‌ర్పంచ్ ర‌ఘువంశీ, నాయ‌కులు పులి ర‌జినీకాంత్‌, పులి విక్ర‌మ్‌, దువ్వ క‌న‌క‌రాజు, కోండ్ర శంక‌ర్‌, గ‌బ్బెట శ్రీ‌నివాస్‌, సుంచు అశోక్‌, సుధాక‌ర్‌, అఫ్జ‌ల్‌, పున్నం చంద‌ర్ మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు