బన్నీ, చెర్రీలకు నో.. మహేశ్‌తో లోకేష్‌ కనగరాజ్‌ మూవీ?

తమిళ స్టార్ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌తో అనుకున్న ప్రాజెక్టులు ప్రస్తుతానికి ముందుకు వెళ్లకపోవడంతో లోకేష్‌ ఇప్పుడు మహేశ్‌ బాబుతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్‌ చేస్తున్నట్టు టాక్‌ వినిపిస్తోంది.

6 అక్టోబర్, 2026 3:53 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బన్నీ, చెర్రీలకు నో.. మహేశ్‌తో లోకేష్‌ కనగరాజ్‌ మూవీ?

తమిళ స్టార్ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ సినిమాలంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి సినిమాలతో ప్రత్యేకమైన యాక్షన్‌ యూనివర్స్‌ను క్రియేట్‌ చేసిన లోకేష్‌ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలోనూ ఆసక్తికరమైన కాంబినేషన్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరకు అల్లు అర్జున్‌-లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ, చిత్ర బృందంలోని కొందరు సాంకేతిక నిపుణులు వాటిని ఖండించారు. అల్లు అర్జున్‌ ‘రాకా’ షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత లోకేష్‌ సినిమా ప్రారంభమవుతుందని అప్పట్లో వెల్లడించారు.

Bunny with Lokesh Kanakaraju

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాల్సిన మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రస్తుతానికి ఈ సినిమాను పక్కన పెట్టినట్టు టాక్‌. అసలు కారణాలు మాత్రం బయటకు రాలేదు. దీంతో బన్నీ-లోకేష్‌ కాంబినేషన్‌ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు లేవనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. మరోవైపు ‘విక్రమ్‌’కు ముందే రామ్‌చరణ్‌తోనూ లోకేష్‌ కనగరాజ్‌ టచ్‌లో ఉన్నట్టు సమాచారం. చెర్రీకి లోకేష్‌ కొన్ని కథలు చెప్పగా వాటిలో కొన్ని నచ్చడంతో సినిమా చేసేందుకు రామ్‌చరణ్‌ కూడా ఆసక్తి చూపించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు మొదలవుతుంది? ఎవరు నిర్మిస్తారు? అనే అంశాలపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. తాజా గాసిప్‌ ప్రకారం రామ్‌చరణ్‌ కూడా ప్రస్తుతానికి లోకేష్‌తో సినిమా చేసే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది. దీంతో లోకేష్‌ తన దృష్టిని మహేశ్‌ బాబు వైపు మళ్లించినట్టు టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ కాంబినేషన్‌ను సెట్‌ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే మహేశ్‌ బాబు-లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌ టాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలోనే భారీ క్రేజ్‌ తెచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Ramcharan With Lokesh Kanakaraju

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘రాకా’పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్‌ చేయాలని సన్‌ పిక్చర్స్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు గతంలో బన్నీతో సినిమా చేయాలనుకున్న దర్శకుడు బోయపాటి శ్రీనుతో ప్రాజెక్ట్‌ను మళ్లీ పట్టాలెక్కించే ఆలోచనలో అల్లు అరవింద్‌ ఉన్నట్టు టాక్‌. అలా బోయపాటి సినిమా, ‘రాకా’ సీక్వెల్‌ వంటి ప్రాజెక్టులతో అల్లు అర్జున్‌ రాబోయే రోజుల్లో ఫుల్‌ బిజీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మహేశ్‌-లోకేష్‌ కాంబినేషన్‌ విషయంలో వస్తున్న ఈ వార్త ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు