అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హిమంత వార్నింగ్..రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20% కట్

మొదటి భార్యకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. అలాంటి ఉద్యోగుల జీతంలో 20 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని మొదటి భార్య బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు.

17 ఆగస్టు, 2026 5:45 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హిమంత వార్నింగ్..రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20% కట్

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేశారు. మొదటి భార్యకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం లేదా మరో మహిళతో సహజీవనం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆగస్టు 15న గువహటిలోని ఖానాపారా మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించి రెండో వివాహం చేసుకుంటున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

జీతంలో 20 శాతం కోత

మొదటి భార్య ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. మొదటి భార్యతో విడాకుల వ్యవహారం కోర్టులో కొనసాగుతున్నా.. కేసు తుది పరిష్కారం అయ్యే వరకు ఉద్యోగి జీతంలో 20 శాతం మొత్తాన్ని కోత విధించి మొదటి భార్య బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు మొదటి భార్యకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని సీఎం హిమంత వివరించారు. చట్టాలను లేదా ప్రభుత్వ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు