వారణాసిలో చంద్రబాబు..కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారణాసిలో పర్యటిస్తున్నారు. కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు.. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని పేర్కొన్నారు.

17 సెప్టెంబర్, 2026 3:46 PM•ByNarender Kumar Nangunoori

Share this article

వారణాసిలో చంద్రబాబు..కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు

వారణాసి,సెప్టెంబర్ 17 (జనవాణి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారణాసిలో పర్యటిస్తున్నారు. గురువారం కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకున్న సీఎం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. మోదీని చూసి దేశం గర్వపడుతోందని పేర్కొన్నారు. ప్రధాని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఆకాంక్షించారు. జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

CBN in KASHI

‘వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్’లో పాల్గొనేందుకు చంద్రబాబు వారణాసికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. మోదీ 76వ జన్మదినం సందర్భంగా వారణాసి నుంచి వాద్నగర్ వరకు సేవా సంకల్ప్ కార్యక్రమాల్లో భాగంగా పలు సేవా, ప్రజా సంబంధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు