ఒక్క గంటలో మారిన కూలీ జీవితం.. లాటరీతో రూ.3 కోట్లు!

రోజూ రూ.500 కోసం కష్టపడే ఓ శ్రామికుడి జీవితం ఒక్క గంటలో పూర్తిగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మధు సింగ్ పంజాబ్‌లోని బంగా ప్రాంతంలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్తూ లాటరీ టికెట్ కొనగా గంటలోనే అతడికి ఏకంగా రూ.3 కోట్ల బహుమతి దక్కింది.

22 సెప్టెంబర్, 2026 4:13 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఒక్క గంటలో మారిన కూలీ జీవితం.. లాటరీతో రూ.3 కోట్లు!

పంజాబ్‌,సెప్టెంబర్ 22 (జనవాణి): కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ఓ శ్రామికుడి జీవితంలో ఒక్క గంటలోనే ఊహించని మార్పు వచ్చింది. రోజంతా కష్టపడితే వచ్చే రూ.500తో జీవనం సాగించే అతడికి లాటరీ రూపంలో ఏకంగా రూ.3 కోట్లు దక్కాయి. దీంతో అతడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన మధు సింగ్ రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అక్కడ వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఇటీవల పంజాబ్‌లోని బంగా ప్రాంతానికి వలస వచ్చాడు. అక్కడ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఓ రోజు పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా మధు సింగ్‌కు ఓ లాటరీ స్టాల్ కనిపించింది. మరో గంటలోనే లాటరీ ఫలితాలు వెలువడనున్నాయని తెలుసుకున్న అతడు ఓ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ టికెట్ తన జీవితాన్నే మార్చబోతోందని అతడు అప్పటికి ఊహించలేదు.

లాటరీ ఫలితాలు వెలువడిన గంట తర్వాత మధు సింగ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ.3 కోట్ల బహుమతి వచ్చిందని అవతలి వ్యక్తులు తెలిపారు. దీంతో మధు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆ వార్తను వెంటనే నమ్మలేకపోయాడు. అనుమానం నివృత్తి చేసుకునేందుకు లాటరీ స్టాల్ వద్దకు వెళ్లి వివరాలు అడగడంతో తాను నిజంగానే భారీ బహుమతి గెలుచుకున్నట్లు తెలిసింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పగానే వారంతా సంబరాల్లో మునిగిపోయారు. లాటరీ నిర్వాహకులు మధు సింగ్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం బహుమతి మొత్తాన్ని అందజేస్తామని వెల్లడించారు.

రూ.3 కోట్లతో ఏం చేస్తారని అడగగా ముందుగా మంచి ఇల్లు నిర్మించుకుంటానని, కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటానని మధు సింగ్ తెలిపాడు. అలాగే కొంత మొత్తాన్ని తన స్వగ్రామం కోసం ఖర్చు చేస్తానని చెప్పాడు. రోజువారీ కూలీగా జీవిస్తున్న అతడి జీవితాన్ని ఒక్క లాటరీ టికెట్ పూర్తిగా మార్చేసింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు