సర్క్యూట్‌ హౌస్‌ ఖాళీ చేయించారు.. అధికారులపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు మహువా మొయిత్రా ప్రివిలేజ్‌ నోటీస్‌..!

Mahua Moitra | కృష్ణనగర్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, నదియా జిల్లా యంత్రాంగంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు. నదియా జిల్లా కలెక్టర్‌ శ్రీకాంత్‌ పాలీ, అదనపు జిల్లా కలెక్టర్‌ నిర్పేంద్ర సింగ్‌, నజరెత్‌ డిప్యూటీ కలెక్టర్‌ అనమికా బేరాపై చర్యలు తీసుకోవాలని కోరారు.

18 ఆగస్టు, 2026 9:43 AM•ByPradeep

Share this article

సర్క్యూట్‌ హౌస్‌ ఖాళీ చేయించారు.. అధికారులపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు మహువా మొయిత్రా ప్రివిలేజ్‌ నోటీస్‌..!

సర్క్యూట్‌ హౌస్‌ ఖాళీ చేయించారు.. అధికారులపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు మహువా మొయిత్రా ప్రివిలేజ్‌ నోటీస్‌..!

Mahua Moitra | కృష్ణనగర్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, నదియా జిల్లా యంత్రాంగంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు. నదియా జిల్లా కలెక్టర్‌ శ్రీకాంత్‌ పాలీ, అదనపు జిల్లా కలెక్టర్‌ నిర్పేంద్ర సింగ్‌, నజరెత్‌ డిప్యూటీ కలెక్టర్‌ అనమికా బేరాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగస్టు 14 రాత్రి తాను నదియా సర్క్యూట్‌ హౌస్‌లో బస చేస్తున్న సమయంలో అక్కడి నుంచి ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారని ఆమె ఆరోపించారు. ఆగస్టు 14న సాయంత్రం 6.15 గంటలకు సర్క్యూట్‌ హౌస్‌కు చేరుకున్నానని మొయిత్రా తెలిపారు. తనకు కేటాయించిన గది సిద్ధంగా ఉందని, రాత్రి 7 గంటలకు టీ, 9.20 గంటలకు భోజనం అందించారని పేర్కొన్నారు. ఆ తర్వాత రాత్రి 9.47 గంటలకు అదనపు జిల్లా కలెక్టర్‌ తనకు ఫోన్‌ చేసి సర్క్యూట్‌ హౌస్‌ ఖాళీ చేయాలని కోరినట్లు చెప్పారు. కారణం అడగ్గా.. పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పినట్లు తెలిపారు.

14న రాత్రి సమాచారం

రాత్రి 10.52 గంటలకు నజరెత్‌ డిప్యూటీ కలెక్టర్‌ తనకు వాట్సాప్‌ ద్వారా ఆగస్టు 12 తేదీతో ఉన్న ఉత్తర్వులను పంపారని మొయిత్రా తెలిపారు. వార్షిక నిర్వహణ, శుభ్రత పనుల కారణంగా ఆగస్టు 14 సాయంత్రం నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సర్క్యూట్‌ హౌస్‌ సేవలు అందుబాటులో ఉండవని అందులో పేర్కొన్నట్లు చెప్పారు. అయితే ఆగస్టు 13లోపు ఖరారైన బుకింగ్‌లకు మినహాయింపు ఉందని తెలిపారు. ఆదేశాలు ఆగస్టు 12న జారీ అయితే.. తనకు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎందుకు సమాచారం ఇచ్చారని మొయిత్రా ప్రశ్నించారు. తనకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు కూడా చేయలేదని మొయిత్రా ఆరోపించారు. అదే రాత్రి పలువురు ప్రభుత్వ అధికారులు సర్క్యూట్‌ హౌస్‌లోనే బస చేశారని పేర్కొన్నారు. పెద్దఎత్తున శుభ్రత, నిర్వహణ పనులు కూడా జరగలేదని అన్నారు. రాత్రి 11 గంటల సమయంలో సర్క్యూట్‌ హౌస్‌ బయట గుంపు, నినాదాలు వినిపించాయని ఆమె ఆరోపించారు. సర్క్యూట్‌ హౌస్‌కు ఎదురుగా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్‌ అధికారిక నివాసాలు ఉన్నాయని.. అది భద్రతాపరంగా కీలక ప్రాంతమని మొయిత్రా పేర్కొన్నారు.

ప్రివిలేజ్‌ కమిటీకి పంపాలని విజ్ఞప్తి

ఈ వ్యవహారాన్ని లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీకి పంపి సంబంధిత ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను మొయిత్రా కోరారు. కృష్ణనగర్‌ నియోజకవర్గానికి వెళ్లినప్పుడు ఎంపీలకు లభించాల్సిన ప్రోటోకాల్‌, సర్క్యూట్‌ హౌస్‌ వినియోగానికి సంబంధించిన సదుపాయాలు తనకు కల్పించేలా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తన పార్లమెంటరీ విధులను అడ్డుకోవడం, భయపెట్టే ప్రయత్నంగా ఈ ఘటనను ఆమె అభివర్ణించారు. ఈ వ్యవహారంపై సీపీఎం ఎంపీ కే రాధాకృష్ణన్‌ కూడా ఓం బిర్లాకు లేఖ రాశారు. దీనిపై అధికారిక దర్యాప్తు జరిపించాలని, ప్రివిలేజ్‌ కమిటీకి పంపాలని కోరారు. సిట్టింగ్‌ మహిళా ఎంపీ పట్ల ఇలాంటి వ్యవహారం తీవ్రమైన అంశమని, ఆమె భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎంపీలకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.

గతంలోనూ వివాదాలు

నదియాలో మహువా మొయిత్రా, బీజేపీ కార్యకర్తల మధ్య వివాదాలకు సంబంధించిన ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. జులై 1న నదియాలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యాలయం వెలుపల బీజేపీ కార్యకర్తలు గుడ్లు, కూరగాయలు, రాళ్లు విసిరారని మొయిత్రా ఆరోపించారు. అయితే భాజపా ఆ ఆరోపణలను ఖండిస్తూ.. అది తృణమూల్‌ కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాల ఫలితమని పేర్కొంది. అంతకుముందు జులై 5న కృష్ణనగర్‌ ఎస్పీతో పాటు పలువురు పోలీసు అధికారులపై కూడా మొయిత్రా ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు.

P

Written By

Pradeep

Reporter

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు