పురుగుకు ఖడ్గమృగంలాంటి కొమ్ము.. చంపావత్‌లో తొలిసారిగా అరుదైన ఐదు కొమ్ముల బీటిల్‌ గుర్తింపు

Rare Five Horned Beetle | సాధారణంగా కనిపించే పురుగుల్లోనే ఎన్నో వింతలు దాగి ఉంటాయి. ప్రకృతి ఒడిలో వాటి ఉనికి మనకు తెలియని ఎన్నో రహస్యాలను పరిచయం చేస్తుంది. అలాంటి అరుదైన జీవి ఒకటి ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో తొలిసారిగా కనిపించింది. ఐదు కొమ్ములు, మెరిసే కవచంలాంటి శరీరంతో ప్రత్యేకంగా కనిపించే ‘యూపటోరస్‌ హార్డ్‌వికీ’ (Eupatorus hardwickei) అనే అరుదైన బీటిల్‌ను అధికారులు గుర్తించారు.

3 ఆగస్టు, 2026 10:52 AM•ByPradeep

Share this article

పురుగుకు ఖడ్గమృగంలాంటి కొమ్ము.. చంపావత్‌లో తొలిసారిగా అరుదైన ఐదు కొమ్ముల బీటిల్‌ గుర్తింపు

పురుగుకు ఖడ్గమృగంలాంటి కొమ్ము.. చంపావత్‌లో తొలిసారిగా అరుదైన ఐదు కొమ్ముల బీటిల్‌ గుర్తింపు

Rare Five Horned Beetle | సాధారణంగా కనిపించే పురుగుల్లోనే ఎన్నో వింతలు దాగి ఉంటాయి. ప్రకృతి ఒడిలో వాటి ఉనికి మనకు తెలియని ఎన్నో రహస్యాలను పరిచయం చేస్తుంది. అలాంటి అరుదైన జీవి ఒకటి ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో తొలిసారిగా కనిపించింది. ఐదు కొమ్ములు, మెరిసే కవచంలాంటి శరీరంతో ప్రత్యేకంగా కనిపించే ‘యూపటోరస్‌ హార్డ్‌వికీ’ (Eupatorus hardwickei) అనే అరుదైన బీటిల్‌ను అధికారులు గుర్తించారు. ఖడ్గమృగ బీటిల్‌ లేదా కొమ్ముల బీటిల్‌గా పిలిచే ఈ జీవి గుర్తింపు చంపావత్‌ ప్రాంతంలోని గొప్ప జీవవైవిధ్యానికి మరో నిదర్శనంగా నిలిచింది.

స్థానికుడి సహాయంతో వెలుగులోకి..

చంపావత్‌లోని బాలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయ ప్రాంగణంలో నరేంద్ర అనే స్థానికుడికి జులై 18న ఈ అరుదైన బీటిల్‌ కనిపించింది. భిన్నమైన ఆకృతి, శరీరంపై ఉన్న కొమ్ముల కారణంగా ఆయన దీనిపై ఆసక్తి చూపించారు. అనంతరం దీని జాతిని గుర్తించేందుకు ప్రయత్నించారు. పరిశీలనల అనంతరం ఇది ‘యూపటోరస్‌ హార్డ్‌వికీ’ అనే అరుదైన బీటిల్‌గా నిపుణులు నిర్ధారించారు. ఈ గుర్తింపును అటవీ శాఖ అధికారులు, జీవశాస్త్ర నిపుణులు కీలకమైన ఆవిష్కరణగా భావిస్తున్నారు. చంపావత్‌ ప్రాంతంలో ఇలాంటి అరుదైన జీవులు మరిన్ని ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

జీవవైవిధ్యం అధ్యయనాలకు కొత్త దారి..

అరుదైన జాతుల ఉనికి ఓ ప్రాంతంలోని పర్యావరణ పరిస్థితులకు అద్దం పడుతుంది. చంపావత్‌లో ఈ బీటిల్‌ కనిపించడం అక్కడి సహజ వాతావరణం అరుదైన జీవులకు అనుకూలంగా ఉందని సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో శాస్త్రీయ అధ్యయనాలు చేపట్టడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ఎంతో అవసరమని వారు పేర్కొంటున్నారు. ఈ గుర్తింపు ద్వారా చంపావత్‌ అడవుల్లో మరిన్ని అరుదైన జాతులపై పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. బీటిల్‌ రెక్కలు కేవలం ప్రకృతిలోని అందంగానే కాకుండా కళారూపాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. కనీసం 15వ శతాబ్దం నుంచే బీటిల్‌ రెక్కలను అలంకరణ వస్తువుల్లో ఉపయోగించిన ఆధారాలు ఉన్నాయి. భారతదేశంలో మొఘల్‌ కాలంలో రాజవస్త్రాలపై చేసే జరీ, జర్దోసీ ఎంబ్రాయిడరీలోనూ బీటిల్‌ రెక్కల భాగాలను వినియోగించినట్లు చరిత్ర చెబుతోంది.

ఆధ్యాత్మిక అనుబంధం..

మెరిసే నల్లటి బీటిల్స్‌కు సంస్కృతం, హిందీలో ‘భృంగ’ అనే పదం ఉపయోగిస్తారు. ఈ పదానికి హిందూ పురాణాల్లోని భృంగితోనూ సంబంధం ఉంది. శివ పురాణం సహా పలు ఆధ్యాత్మిక గ్రంథాల్లో మహర్షి భృంగిని పరమశివుడి భక్తుల్లో ఒకరు. పురాణ కథనం ప్రకారం.. భృంగి శివుడినే మాత్రమే ప్రదక్షిణ చేయడంతో పార్వతీదేవి ఆగ్రహించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. కీటక రూపంలో మారి శివుడికి ప్రదక్షిణ చేసేవాడు. ఇదిలా ఉండగా.. యూపటోరస్‌ హార్డ్‌వికీ బీటిల్‌ సాధారణంగా దట్టమైన అడవుల్లో నివసించేందుకు ఇష్టపడుతుంది. అధిక తేమ, చల్లటి వాతావరణం ఉన్న సతత హరిత అడవులు దీనికి అనుకూలమైన ఆవాసాలు. శరీరంపై ఐదు కొమ్ములు ఉండటం ఈ జాతి ప్రత్యేకత. చంపావత్‌లో ఈ అరుదైన బీటిల్‌ గుర్తింపు.. అక్కడి అడవుల సహజ సంపదను మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రకృతిలో దాగి ఉన్న ఇలాంటి అరుదైన జీవులను సంరక్షించడం భవిష్యత్‌ తరాలకు ఎంతో అవసరమని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

P

Written By

Pradeep

Reporter

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు