Sachin Tendulkar | తొలి గురువు తండ్రే..యువ డాక్టర్లకు సచిన్‌ ఆర్థిక సాయం

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గురుపూజోత్సవం సందర్భంగా తన తండ్రి ప్రొఫెసర్‌ రమేశ్‌ టెండూల్కర్‌ జ్ఞాపకార్థం ఓ గొప్ప సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువ వైద్యులను ప్రోత్సహించేందుకు ‘ప్రొఫెసర్‌ రమేశ్‌ టెండూల్కర్‌ మెమోరియల్‌ ఫెలోషిప్‌’ను ప్రకటించారు.

5 సెప్టెంబర్, 2026 6:27 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Sachin Tendulkar | తొలి గురువు తండ్రే..యువ డాక్టర్లకు సచిన్‌ ఆర్థిక సాయం

Sachin Tendulkar | సెప్టెంబర్ 5 (జనవాణి): గురుపూజోత్సవం సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి ప్రొఫెసర్‌ రమేశ్‌ టెండూల్కర్‌ జ్ఞాపకార్థం యువ వైద్యుల కోసం ప్రత్యేక ఫెలోషిప్‌ను ప్రకటించారు. సచిన్‌ టెండూల్కర్‌ ఫౌండేషన్‌ (STF) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘ప్రొఫెసర్‌ రమేశ్‌ టెండూల్కర్‌ మెమోరియల్‌ ఫెలోషిప్‌’ ద్వారా యువ వైద్యులకు శ్రీనగర్‌లో క్లఫ్ట్‌ (పెదవి చీలిక), క్రానియోఫేషియల్‌ (ముఖ ఎముకలకు సంబంధించిన) వైద్య విభాగాల్లో ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించనున్నారు. ఈ ఫెలోషిప్‌ కింద ఏటా ఒక MD వైద్యుడిని ఎంపిక చేసి ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సచిన్‌ టెండూల్కర్‌ ఫౌండేషన్‌ అందించనుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వైద్యుడికి STF తరఫున ప్రత్యేక సర్టిఫికేట్‌ కూడా అందజేస్తారు.

కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సచిన్‌ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు ముందుగా క్రికెట్‌ మైదానం లేదా కోచ్‌లు గుర్తుకు రావని.. తన క్రికెట్‌ ప్రయాణం ఇంటి నుంచే ప్రారంభమైందని చెప్పారు. తన తొలి గురువు తన తండ్రేనని సచిన్‌ పేర్కొన్నారు. ప్రొఫెసర్‌, రచయిత, కవిగా మాత్రమే కాకుండా తనకు అత్యుత్తమ మార్గదర్శిగా రమేశ్‌ టెండూల్కర్‌ నిలిచారని గుర్తుచేసుకున్నారు.

Sachin father

క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే విషయంలో తన తండ్రి తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని సచిన్‌ తెలిపారు. అయితే ఎంతటి విజయాలు సాధించినా నైతిక విలువలను మాత్రం ఎప్పటికీ కోల్పోకూడదని తండ్రి తనకు నేర్పినట్లు చెప్పారు. తండ్రి విలువలు, ఆశయాలను కొనసాగించేలా యువ వైద్యులకు ఈ ఫెలోషిప్‌ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల సచిన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా రంగంలో సాధించిన విజయాలతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తన వంతు సహకారం అందిస్తున్న సచిన్‌ మరోసారి ఆదర్శంగా నిలిచారు.

Sachin Family

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు