శ్రీ విజయపురం (అండమాన్ & నికోబార్ దీవులు), ఆగస్టు 9 (జనవాణి): 'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో భాగంగా అండమాన్ & నికోబార్ దీవులలోని శ్రీ విజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రదేశం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో విశిష్ట స్థానం కలిగి ఉంది.
1943 డిసెంబర్ 30న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇదే ప్రాంతంలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అండమాన్, నికోబార్ దీవులను బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన ప్రాంతాలుగా ప్రకటించారు. ఆ చారిత్రక ఘట్టాన్ని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ ఇచ్చిన "డూ ఆర్ డై" పిలుపుతో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు ఉపరాష్ట్రపతి ఘన నివాళులు అర్పించారు. వారి ధైర్యసాహసాలు, త్యాగాలు, దేశభక్తి భావం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అనంతరం శ్రీ విజయపురంలో నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా – డెడికేటెడ్ టు ది స్పిరిట్ ఆఫ్ వందే మాతరం' రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Loading Tweet...




















