బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అరెస్ట్

బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ను హైదరాబాద్ గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. క్రిశాంక్‌తో పాటు ఎంఆర్ మీడియా తెలంగాణ, మరికొందరిని కూడా ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.

6 అక్టోబర్, 2026 4:26 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అరెస్ట్

హైదరాబాద్, అక్టోబర్ 6 (జనవాణి): బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అరెస్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యాపార, ఆర్థిక వ్యవహారాలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మంగళవారం (అక్టోబర్ 6) గోపాలపురం పోలీసులు క్రిశాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మన్నె క్రిశాంక్‌తో పాటు ఎంఆర్ మీడియా తెలంగాణ, మరికొందరిని కూడా నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 353(2), 352 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

రేవంత్ కుటుంబంపై క్రిశాంక్ ఆరోపణలు

అక్టోబర్ 3న బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మన్నె క్రిశాంక్ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మెడికవర్ హాస్పిటల్స్, మాక్స్‌బియన్ ఫార్మా, సహృదయ హెల్త్‌కేర్, గీతా ఆటోమోటివ్‌తో పాటు కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని క్రిశాంక్ ఆరోపించారు. ఆయా సంస్థల యాజమాన్యం, వాటాలు, నిధులు, ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని కోరారు. తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే వాటిని వెనక్కి తీసుకుని క్షమాపణ చెబుతానని కూడా ఆయన ప్రకటించారు.

కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో కేసు

క్రిశాంక్ ఆరోపణలపై కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ హైదరాబాద్ డీసీపీ (క్రైమ్) చైతన్య కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై క్రిశాంక్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డికి ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. క్రిశాంక్‌తో పాటు సోషల్ మీడియాలో ఈ ఆరోపణలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన క్రిశాంక్

తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్రిశాంక్ సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆరోగ్య, విద్యా రంగాలను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో పెట్టుబడులు పెట్టి కుటుంబ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష పార్టీ విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిగజారుడుతనమని ఆయన విమర్శించారు. తన ఆరోపణలకు ప్రభుత్వం, అధికార పార్టీ, సీఎం కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నమోదైన కేసులో మన్నె క్రిశాంక్ అరెస్ట్ కావడం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని తీవ్రతరం చేసింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు