వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకర్‌పల్లి మండలం కేసారం నుంచి ధారూర్ మండలం చింతకుంటకు అంత్యక్రియలకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాన్ని 16 టైర్ల భారీ ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిని మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.
ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా బైక్‌పై పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం ఎంత ప్రమాదకరమో చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఓ బైక్‌పై ఓ వృద్ధుడు ఏకంగా ఆరుగురు నుంచి ఏడుగురు చిన్నారులను తీసుకెళ్తున్న దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్‌రోడ్డుపై క్లూజర్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం సమీపంలో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా.. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే తమ కుమార్తెలది ప్రమాదంలో జరిగిన మృతి కాదని, యువకులు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపుతోంది.
కామారెడ్డి జిల్లా జుక్కల్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ డి. ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా, కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని 13 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇన్నోవా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన బిహార్‌కు చెందిన నందులాల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరో కారు ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి టీటీడీ బోర్డు సభ్యుడు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఫ్రెష్ బస్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం ధాటికి బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేసినట్లు తెలుస్తోంది.
కృష్ణా జిల్లా పామిడిముక్కల మండలం మాంటాడ సెంటర్ సమీపంలో బైక్ ప్రమాదం జరిగింది. వయ్యూరు నుంచి పామర్రు వెళ్తున్న దేవరకొండ రాజేష్ అనే 21 ఏళ్ల యువకుడు మలుపు వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లాడు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అధిక వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను బలవంతపూర్‌కు చెందిన భాగ్య, రాజు, పిల్లలు నియాన్, శాన్వికగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం బావిలో నుంచి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొండగట్టు సమీపంలో జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో జాతీయ రహదారి-65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును ఐషర్ వాహనం ఢీకొనడంతో రెండు వాహనాలు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయాయి. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో శుక్రవారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్విమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరు వైద్య విద్యార్థులను ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్టీసీ బస్సును చోరీ చేసి నిర్లక్ష్యంగా నడుపుతూ పలువురు వాహనదారులను ఢీకొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.