ఫార్ములా ఈ-కార్ కేసు: నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్ హాజరు.. విచారణ ఆగస్టు 25కి వాయిదా

హైదరాబాద్‌లో జరిగిన రూ.55 కోట్ల ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 25కి వాయిదా వేసింది.

31 జులై, 2026 3:21 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఫార్ములా ఈ-కార్ కేసు: నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్ హాజరు.. విచారణ ఆగస్టు 25కి వాయిదా

Social Media Image

హైదరాబాద్‌, జులై, 31: హైదరాబాద్‌లో జరిగిన రూ.55 కోట్ల ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఏ2 నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి కూడా కోర్టులో ప్రత్యక్షమయ్యారు. విచారణ అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేస్తూ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు వద్ద భారీగా బీఆర్ఎస్ శ్రేణులు

కేటీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నాంపల్లి కోర్టు ఆవరణకు చేరుకున్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు పార్టీ నేతలు కోర్టు వద్దకు వచ్చారు. దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది

కేసు ఏంటి?

హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు సందర్భంగా హెచ్‌ఎమ్‌డీఏ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని ఏసీబీ ఆరోపిస్తోంది. రేసు నిర్వహణ, ట్రాక్ నిర్మాణం, ఇతర ఏర్పాట్ల పేరిట హెచ్‌ఎమ్‌డీఏ ఖజానా నుంచి రూ.55 కోట్లకు పైగా ఖర్చు చేశారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ ఖర్చులకు సంబంధించి నిబంధనలను పాటించకుండా, అవసరమైన పరిపాలనా అనుమతులు లేకుండానే నిధులు విడుదల చేశారని, మూడు సీజన్లకు సంబంధించిన వ్యయాన్ని ఒకే రేసుకు సంబంధించిన ఖర్చుగా చూపినట్లు అభియోగాల్లో పేర్కొంది. అంతేకాకుండా, రాష్ట్ర మంత్రివర్గ అనుమతి లేకుండానే కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తోంది.

విదేశీ చెల్లింపులపై అభియోగాలు

విదేశీ సంస్థలకు నిధుల బదిలీ ప్రక్రియలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు, దేశీయ పన్ను నిబంధనలు ఉల్లంఘించారని ఏసీబీ దర్యాప్తులో వెల్లడించింది. ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతులు లభించిన అనంతరం కేటీఆర్, అర్వింద్ కుమార్ తదితరులపై ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది.

గమనిక: ఈ కేసులో చేసిన ఆరోపణలు దర్యాప్తు సంస్థ నమోదు చేసిన అభియోగాల ఆధారంగా ఉన్నాయి. తుది నిర్ణయం కోర్టు విచారణ అనంతరం వెలువడే తీర్పుపై ఆధారపడి ఉంటుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు