బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అరెస్టు

అరెస్టును ఖండించిన డీకే అరుణ

22 జులై, 2026 12:42 PM•ByJanavaani Admin

Share this article

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అరెస్టు

హైదరాబాద్, జూలై 22: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అరెస్టును బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ శాంతియుతంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న రాంచందర్‌రావుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

తెలంగాణలో బీజేపీ గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. రాంచందర్‌రావు అరెస్టు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

నీట్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు సిద్ధమని స్పష్టం చేసినప్పటికీ, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటోందని డీకే అరుణ ఆరోపించారు.

కాంగ్రెస్ రాజకీయ డ్రామాలకు స్వస్తి పలికి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని ఆమె కోరారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు అరెస్టు చేసిన ఇతర బీజేపీ నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు