జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎస్పీ మహేష్ బి. గితేలకు ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి శ్రీ భీమేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, వ్యవసాయం అభివృద్ధి చెందాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.




















