రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి పార్లమెంట్‌లో నిరసనలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేసిన విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు.

28 జులై, 2026 12:42 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి పార్లమెంట్‌లో నిరసనలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

న్యూఢిల్లీ, జులై 28: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. పార్లమెంట్‌లోని మకర్ ద్వార్ వద్ద జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ... ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థుల గొంతును అణిచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని కోరారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును కాలరాసే చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కడియం కావ్య స్పష్టం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు