తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాల పంట.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 38 మందికి గౌరవం

స్వాతంత్ర్య దినోత్సవం-2026 సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 38 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి పతకాలు దక్కాయి. ఏపీ నుంచి 23 మంది, తెలంగాణ నుంచి 15 మంది ఎంపికయ్యారు.

14 ఆగస్టు, 2026 11:28 AM•ByRalin

Share this article

తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాల పంట.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 38 మందికి గౌరవం

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనవాణి): స్వాతంత్ర్య దినోత్సవం-2026 సందర్భంగా ప్రకటించిన పోలీసు సేవా పతకాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. మొత్తం 1057 పతకాలను ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన మొత్తం 38 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ కేటగిరీల్లో పతకాలకు ఎంపికయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 23 మంది, తెలంగాణ నుంచి 15 మంది ఉన్నారు.

ఏపీ నుంచి 23 మంది

ఆంధ్రప్రదేశ్‌కు 7 గ్యాలంట్రీ మెడల్స్‌ (GM), 2 ప్రెసిడెంట్స్‌ మెడల్స్‌ ఫర్‌ డిస్టింగ్విష్డ్‌ సర్వీస్‌ (PSM), 14 మెడల్స్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ (MSM) దక్కాయి. గ్యాలంట్రీ మెడల్స్‌ పొందిన వారిలో కోర్లాన మల్లేశ్‌, పైడి శ్రీరామమూర్తి, ఆదరి హేమ సుందరరావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేశ్‌, అబోతుల అప్పలనాయుడు, రుతల కన్నబాబు ఉన్నారు. డిస్టింగ్విష్డ్‌ సర్వీస్‌ పతకాలకు విజయకుమార్‌ గుడి, వెంకట రామిరెడ్డి బాలంకరి ఎంపికయ్యారు.

మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు పొందిన వారిలో గీతా దేవి వెలగ, సుబ్బారావు తుమ్మల, జగ్జు నాయుడు పెంట, రామకృష్ణ I, చంద్రమోహన్‌ సాదేపల్లి, కంజాక్షన్‌ పసుపులేటి, మహబూబ్‌ బాషా సయ్యద్‌, శ్రీనివాసరాజు మంతిన, రామప్రసాద్‌ M, మోహన్‌రావు యలపు, శేషపాణి పగడాల, రాజారావు రోలుపల్లి, బసవయ్య పోదిలి, చెంచురామయ్య నడిపినేని ఉన్నారు.

తెలంగాణ నుంచి 15 మంది

తెలంగాణ నుంచి 3 గ్యాలంట్రీ, 2 డిస్టింగ్విష్డ్‌ సర్వీస్‌, 10 మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు దక్కాయి. గ్యాలంట్రీ మెడల్స్‌కు బి. సత్యారావు, కె. సందీప్‌కుమార్‌, జె. వంశీకృష్ణ ఎంపికయ్యారు. వీరంతా జూనియర్‌ కమాండోలుగా పనిచేస్తున్నారు. డిస్టింగ్విష్డ్‌ సర్వీస్‌ పతకాలకు నర్సయ్య జోగుల, ఆర్‌. జగదీశ్వర్‌రెడ్డి ఎంపికయ్యారు.

మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు పొందిన వారిలో పి. జగదీశ్వర్‌, పి. వెంకట రమణ, భూమన రవికుమార్‌రెడ్డి, బాచలకూర రమేశ్‌, గంగారం ఆశాల, ఆర్‌.జి. శివ మారుతి, సి. రాములు, డి. సత్యనారాయణ, కె. తిరుపతిరాజు, భూపతి శ్రీనివాసరావు ఉన్నారు.

మూడు విభాగాల్లో గుర్తింపు

మొత్తంగా చూస్తే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 38 మందిలో 10 మందికి గ్యాలంట్రీ మెడల్స్‌, 4 మందికి ప్రెసిడెంట్స్‌ మెడల్స్‌ ఫర్‌ డిస్టింగ్విష్డ్‌ సర్వీస్‌, 24 మందికి మెడల్స్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ దక్కాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలు, విశిష్ట సేవలు, ప్రతిభావంతమైన సేవలకు గుర్తింపుగా ఈ పతకాలు లభించాయి.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు