న్యూఢిల్లీ/హైదరాబాద్ (తెలంగాణ), జూలై 22: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రబీ సీజన్‌కు సంబంధించి బియ్యం రూపంలో అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రానికి సవరించిన వరి కొనుగోలు అంచనాను 43 లక్షల మెట్రిక్ టన్నులు (LMT)గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ అంశంపై పార్లమెంట్‌లో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి *బండి సంజయ్ కుమార్* కలిశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంచనాను పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి, మంత్రి ప్రహ్లాద్ జోషికి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.
అదే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వాహనాల స్థాన నిర్ధారణ వ్యవస్థ (Vehicle Location Tracking System - VLTS)ను *2026 సెప్టెంబర్ 30*లోపు పూర్తిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడైంది.
ఈ నిర్ణయంతో తెలంగాణ రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.




















