న్యూఢిల్లీ జులై 29: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తనపై ఇటీవల విమర్శలు చేసిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వ్యాఖ్యలకు ఆమె సోషల్ మీడియా వేదికగా గట్టిగా స్పందించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సౌరవ్ దాస్.. కంగనా రనౌత్ చేసే వ్యాఖ్యలను ఆమె సొంత పార్టీ నాయకులే పెద్దగా పట్టించుకోరని వ్యాఖ్యానించారు. యువత, ముఖ్యంగా Zen Z వర్గం ఆమె అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వదని పేర్కొంటూ, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతమైన భాషలో మాట్లాడాలని సూచించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా ఘాటు స్పందన
సౌరవ్ దాస్ వ్యాఖ్యలకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించిన కంగనా రనౌత్.. అతనిపై తీవ్ర విమర్శలు చేశారు. "28 ఏళ్ల వయసు వచ్చినా కూడా తనను తాను ఇంకా విద్యార్థినని చెప్పుకోవడం విచిత్రంగా ఉంది. అతను ఉన్న వయసులోనే నేను రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నాను. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను" అని పేర్కొన్నారు. తన అనుభవాన్ని తక్కువ అంచనా వేయొద్దని, విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఆమె సూచించారు.
నిరసనలపై తన వైఖరి సమర్థించిన కంగనా
Zen Z నిరసనలపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కూడా కంగనా సమర్థించుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అసభ్యకరమైన భాష ఉపయోగించడం ప్రజాస్వామ్యంలో సమర్థించదగిన విషయం కాదని అన్నారు. ఇతరులను విమర్శించే వారు, తమపై వచ్చే విమర్శలను కూడా స్వీకరించే ధైర్యం కలిగి ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కంగనా రనౌత్, సౌరవ్ దాస్ మధ్య జరిగిన ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న వ్యాఖ్యలు సంబంధిత వ్యక్తులు సోషల్ మీడియా, ఇంటర్వ్యూలలో చేసిన ప్రకటనల ఆధారంగా ఉన్నాయి.




















