నన్నే కాదు.. నా తల్లినీ దూషించారు, అయినా ‘ఆ పిల్లల్ని క్షమిస్తున్నా’..ప్రధాని మోదీ భావోద్వేగ సందేశం

ఇటీవలి విద్యార్థుల నిరసనల సందర్భంగా తనపై, తన స్వర్గీయ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని క్షమిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వారిని శిక్షించడం కంటే తప్పుల నుంచి నేర్చుకునే అవకాశం ఇవ్వాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

1 ఆగస్టు, 2026 12:09 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నన్నే కాదు.. నా తల్లినీ దూషించారు, అయినా ‘ఆ పిల్లల్ని క్షమిస్తున్నా’..ప్రధాని మోదీ భావోద్వేగ సందేశం

Janavaani Image

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఇటీవలి విద్యార్థుల నిరసనల సందర్భంగా తనపై, తన స్వర్గీయ తల్లిపై కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. జరిగిన ఘటన బాధ కలిగించినప్పటికీ, వారిని క్షమించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

ప్రధాని విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధాని మాట్లాడుతూ.. జంతర్‌మంతర్‌ నిరసనల సమయంలో తనపై మాత్రమే కాకుండా, తన తల్లిని కూడా అవమానించేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, యువతలో కొన్నిసార్లు భావోద్వేగాల ప్రభావంతో తప్పులు జరుగుతాయని, వాటి నుంచి నేర్చుకోవడమే ముఖ్యమని పేర్కొన్నారు.

సమాజంలో ఉన్న అసంతృప్తిని నేను అర్థం చేసుకోగలను. అది ఒక విధమైన సామాజిక మార్పు ప్రభావం కావచ్చు. కానీ వీళ్లంతా మన పిల్లలే. వారిని కోర్టుల చుట్టూ తిప్పడం, శిక్షించడం వల్ల సమాజానికి మేలు జరగదు. వారికి మార్పు వచ్చేలా అవకాశం ఇవ్వాలి అని ప్రధాని అన్నారు.

విద్యార్థులకు ప్రత్యేకంగా పిలుపునిస్తూ.. "మీరు చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. దేశం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోంది. మీరు కూడా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. మనమంతా కలిసి భారత భవిష్యత్తును మరింత బలంగా నిర్మిద్దాం" అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు