Udayanidhi Stalin | త్రిషపై డబుల్‌మీనింగ్ వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో తమిళనాడులో ఉద్రిక్తత

సినీ నటి త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

4 ఆగస్టు, 2026 1:18 PM•ByRalin

Share this article

Udayanidhi Stalin | త్రిషపై డబుల్‌మీనింగ్ వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో తమిళనాడులో ఉద్రిక్తత

ఉదయనిధి స్టాలిన్‌ను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుంటున్న తంజావూరు పోలీసులు

Udayanidhi Stalin | సినీ నటి త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేయడానికి పోలీసులు వస్తున్నారన్న విషయం తెలిసి డీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. సీఎం విజయ్‌పై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు టీవీకే శ్రేణులు సైతం అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే.. దీనిపై న్యాయపోరాటం చేస్తానని స్టాలిన్ తెలిపారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కాసేపట్లో అత్యవసర విచారణ జరగనుంది.

అసలు వివాదమేంటి?

కావేరీ జలాల అంశంపై సోమవారం తంజవూర్‌లో డీఎంకే నిరసన సభ చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొన్న స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డెల్టా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఎం విజయ్‌ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరును గట్టిగా అరిచారు. దీనికి ఉదయనిధి స్పందిస్తూ డబుల్ మీనింగ్ వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

Loading Tweet...

ఉదయనిధి నివాసం దగ్గర ఉద్రిక్తత

ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతలు ఆరోపించారు. దీనిపై తంజావూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తంజావూరు పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం ఉదయం చెన్నైలోని ఉదయనిధి నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అరెస్టు సమాచారం తెలిసిన వెంటనే డీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉదయనిధి నివాసానికి చేరుకున్నారు. పోలీసు చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మరోవైపు విజయ్ మద్దతుదారులు కూడా అక్కడకు చేరుకుని నిరసనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించారు. అదనపు బలగాలు రంగంలోకి దిగి, డీఎంకే కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.

Loading Tweet...

జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

ఇదిలా ఉంటే.. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై తంజావూరు పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా జాతీయ మహిళా కమిషన్‌ను సైతం టీవీకే నేతలు ఆశ్రయించారు. ఉదయనిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరింది. మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తూ తమిళనాడులోని పలు జిల్లాల్లో టీవీకే మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టీవీకే అమెరికా విభాగం ప్రతినిధి నారాయణన్ మాట్లాడుతూ.. సీఎం విజయ్‌ను విమర్శించినందుకు ఉదయనిధిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. మహిళలన అవమానించేలా మాట్లాడినందుకే చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. ఇక ఉదయ నిధి వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు అసభ్యకరమని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Loading Tweet...

కావేరీ జలాల గురించే మాట్లాడాను.. ఉదయనిధి వివరణ

కాగా, త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్పందించారు. తాను కేవలం కావేరీ జలాల అంశానికి సంబంధించి మాత్రమే వ్యాఖ్యలు చేశానని వివరించారు. అలాగే తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనుంది.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు