ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. పలువురు భక్తులకు గాయాలు

నాగుల పంచమి వేళ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. బారికేడ్ల కు కరెంట్ షాక్ వచ్చిందన్న తప్పుడు సమాచారంతో భక్తులు ఆందోళన తొక్కిసలాటకు దారి తీసింది

17 ఆగస్టు, 2026 2:49 PM•ByVijay Kumar

Share this article

ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. పలువురు భక్తులకు గాయాలు

జనవాణి: ఉజ్జయిని August 17: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో నాగుల పంచమి వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, నాగచంద్రేశ్వర ఆలయ వార్షిక ప్రారంభోత్సవం కోసం భారీగా తరలివచ్చిన భక్తుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. పోలీస్ బారికేడ్లకు విద్యుత్ సరఫరా అవుతోందంటూ వచ్చిన తప్పుడు సమాచారంతో భక్తులు భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. నాగుల పంచమి సందర్భంగా భారీ రద్దీ మద్యాహ్నం 12 గంటల వరకు 6 లక్షల భక్తులు దర్శనం చేసుకున్నారు శ్రావణ సోమవారం, నాగుల పంచమి సందర్భంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనంతో పాటు నాగచంద్రేశ్వర ఆలయ వార్షిక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

నాగచంద్రేశ్వర ఆలయం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే భక్తుల దర్శనానికి తెరుచుకోవడం వల్ల ఈ రోజున ఉజ్జయినిలో భారీ రద్దీ నెలకొంటుంది. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

కరెంట్ షాక్ అంటూ పుకారు.. ఒక్కసారిగా భయాందోళనలు

దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య క్యూలో వేచి ఉండగా.. పోలీస్ బారికేడ్లకు విద్యుత్ సరఫరా అవుతోందంటూ సమాచారం వ్యాపించింది. దీంతో కొందరు భక్తులు భయాందోళనకు గురై ఒక్కసారిగా వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. పలువురు కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. పలువురు భక్తులు గాయపడినట్లు సమాచారం.

క్షణాల్లో మారిన పరిస్థితి

భక్తుల మధ్య గందరగోళం నెలకొనడంతో పోలీసులు, ఆలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలుస్తోంది.

తొక్కిసలాటకు సంబంధించి విద్యుత్ సరఫరాపై వచ్చిన సమాచారం నిజమా? లేదా వదంతి కారణంగానే భక్తులు ఆందోళనకు గురయ్యారా? అనే అంశంపై అధికారులు వివరాలు పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉండగా, భారీ రద్దీ కారణంగా ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే సందర్భాల్లో ఇలాంటి వదంతులు వేగంగా వ్యాప్తి చెందకుండా ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడం కీలకంగా మారింది.

భారీ భక్తుల రద్దీతో ముందే అప్రమత్తమైన అధికారులు

నాగుల పంచమి సందర్భంగా మహాకాళేశ్వర ఆలయానికి భారీగా భక్తులు వస్తారని ముందుగానే అంచనా వేసిన అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకపోకలను నియంత్రించేందుకు బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో రద్దీ నియంత్రణకు సిబ్బందిని మోహరించారు. అయితే క్యూలో ఉన్న సమయంలో ఒక్కసారిగా పుకారు వ్యాపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు