Hyderabad: ఐటీ కంపెనీ ముందు భారీ కొండచిలువ..ఆ తర్వాత ఏం జరిగిందంటే?

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు పరిసరాల్లో భారీ కొండచిలువ కనిపించడంతో ఐటీ ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఓ ఐటీ ఉద్యోగి దాన్ని చాకచక్యంగా పట్టుకుని చేతికి చుట్టేసుకున్నాడు. అనంతరం మిత్రుడితో కలిసి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

18 సెప్టెంబర్, 2026 3:35 PM•ByNarender Kumar Nangunoori

Share this article

Hyderabad: ఐటీ కంపెనీ ముందు భారీ కొండచిలువ..ఆ తర్వాత ఏం జరిగిందంటే?

హైదరాబాద్,సెప్టెంబర్ 18 (జనవాణి): హైదరాబాద్‌లోని దుర్గం చెరువు పరిసరాల్లో భారీ కొండచిలువ ప్రత్యక్షమవడంతో అక్కడి ఐటీ ఉద్యోగుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. గురువారం (సెప్టెంబర్ 17న) సాయంత్రం ఓ ఐటీ కంపెనీ సమీపంలోని వీధిలో పైథాన్ కనిపించడంతో ఉద్యోగులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

అయితే ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఐటీ ఉద్యోగి ఏమాత్రం భయపడకుండా కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం దాన్ని తన చేతికి చుట్టుకుని నడుచుకుంటూ వెళ్లడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆ తర్వాత తన మిత్రుడి సహాయంతో కొండచిలువను బైక్‌పై తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు ఆ ఐటీ ఉద్యోగి ధైర్యంపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు