కర్ణాటకలో ఓ యువరైతు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు, పొలాలు ఉండి కష్టపడి వ్యవసాయం చేస్తున్న యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని ఆయన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీల తరహాలో దీనినీ ‘ఆరో గ్యారంటీ’గా పరిగణించాలని కోరారు.
రాయలసీమ అభివృద్ధిలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ.. “నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి” అంటూ సీఎం చంద్రబాబును కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉల్లి, కంది పప్పు, పామాయిల్ వంటి సరుకులను త్వరలో ఈ వ్యవస్థల ద్వారా సరఫరా చేయాలని సూచించారు.
దానిమ్మ సాగులో వరుస నష్టాలు రావడంతో పంట మార్చాలని నిర్ణయించుకున్న మహారాష్ట్ర యువ రైతు సాగర్ యెల్పలే.. మునగ సాగుతో అద్భుత విజయాన్ని సాధించాడు. తొలుత ఎకరంలో ప్రారంభించిన సాగును 18 ఎకరాలకు విస్తరించి, ప్రస్తుతం ఏడాదికి సుమారు 180-200 టన్నుల మునగ దిగుబడి పొందుతున్నాడు. మునగకాయలు, విత్తనాల విక్రయంతో కలిపి ఏడాదికి రూ.1.15 కోట్ల టర్నోవర్, రూ.80 లక్షలకు పైగా లాభం ఆర్జిస్తున్నాడు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సిత్య తండాలో సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. SRSP కాలువ ద్వారా వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా నిరసన చేపట్టారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి దిగుబడికి కాళేశ్వరం ప్రాజెక్టు కారణం కాదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంచి వర్షాలు, కొత్త బోర్లు, రైతు సంక్షేమ పథకాలే సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమని తెలిపారు.
2026-27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. 15–30 రోజుల్లో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించాలని, మానిటరింగ్ కమిటీల్లో రైతులకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారిని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ బి.అశోక్ తెలిపారు. సోషల్ మీడియా జర్నలిస్టులుగా చెప్పుకుంటూ ఇద్దరూ కుమ్మక్కై వ్యవసాయాధికారిపై ఒత్తిడి తెచ్చి డబ్బులు డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.
తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా-గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న రెండేళ్ల వ్యవసాయ, విత్తన సాంకేతిక, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులతో పాటు మూడేళ్ల వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం స్పెషల్ కేటగిరి, మాన్యువల్ మాప్‌అప్, చివరి విడత స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎ. మణి తెలిపారు.
రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణలో చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచి చక్కెర పరిశ్రమలను పునరుద్ధరించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల ప్రోత్సాహక విధానాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.
రైతుల సంక్షేమాన్ని కోరుకోవడం ప్రతి రాజకీయ నాయకుడి ప్రధాన బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు మేలు చేసే సూచనలను ప్రభుత్వం స్వాగతిస్తుందని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్న సమయంలో వారిలో ఆందోళన కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఏలేరు ఆయకట్టు పరిధిలోని రైతులకు ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆయన సూచనల మేరకు పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని సుమారు 53 వేల ఎకరాల ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) 2.0 కింద రాష్ట్రానికి 11.56 లక్షల ఇళ్లను కేటాయించడంతో పాటు గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ధరల లోటు భర్తీ కింద కిలో పొగాకుకు రూ.20 చెల్లించడంతో పాటు, 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకాన్ని వ్యవసాయానికి అనుబంధంగా చేపడితే రైతులు, నిరుద్యోగ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే ఈ రంగాలను ప్రభుత్వ పథకాల సాయంతో విస్తరించాలని ఆమె సూచించారు.
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల పనితీరును మరింత పారదర్శకంగా, రైతు కేంద్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మార్కెట్ కమిటీల్లో సేవలు, కనీస మద్దతు ధర (MSP) అమలు, వేలం విధానం, మౌలిక సదుపాయాలు, మార్కెట్ సెస్ వసూళ్లపై సమగ్ర తనిఖీలు నిర్వహించేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
ఇంజినీరింగ్‌లో సీటు రాలేదని ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇది శుభవార్త. భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, స్మార్ట్ ఫార్మింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను బోధించే B.Sc Agritech (Hons.) కోర్సు ఇప్పుడు విద్యార్థులకు కొత్త కెరీర్ అవకాశాలను అందిస్తోంది. ముఖ్యంగా ఎంసెట్ ర్యాంక్‌తో సంబంధం లేకుండానే ఈ కోర్సులో చేరే అవకాశం ఉండటం విశేషం.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల (బియ్యం రూపంలో) ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది.