Pavala Shyamala | సినీ ఇండస్ట్రీలో విషాదం.. పావలా శ్యామల కన్నుమూత

Pavala Shyamala | సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నటి పావలా శ్యామల కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

28 జులై, 2026 7:26 AM•ByRamchandram

Share this article

Pavala Shyamala | సినీ ఇండస్ట్రీలో విషాదం.. పావలా శ్యామల కన్నుమూత

Pavala Shyamala

Pavala Shyamala | సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నటి పావలా శ్యామల కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె మరణించినట్లుగా ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. హైబీపీ, ఆకరోనా ఆర్టరీ వ్యాధి, పార్కిన్సన్, గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు.

ఏపీలోని గుంటూరు జిల్లాలో పావలా శ్యామల జన్మించారు. ఆమె అసలు పేరు నేతి శ్యామల. ఆమె పదో తరగతి వరకు చదువుకున్నారు. నాటక రంగంతో కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1985లో బాలకృష్ణ హీరోగా వచ్చిన బాబాయ్ అబ్బాయ్ సినిమాతో పావలా శ్యామల ఇండస్ట్రీలోకి వచ్చారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాతో నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఖడ్గం, గోలీమార్, ఆంధ్రావాలా సినిమాలతో ఆమె పాపులర్ అయ్యారు.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు