సోషల్ మీడియా దిగ్గజాలకు కేంద్రం షాక్..ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్, గూగుల్‌కు సమన్లు.. ఆగస్టు 3న కీలక సమావేశం

ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి కేంద్రం షాకిచ్చింది. సమన్లు జారీ చేసింది. డేటా ప్రైవసీ, ఇతర రూల్స్ సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

28 జులై, 2026 6:50 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సోషల్ మీడియా దిగ్గజాలకు కేంద్రం షాక్..ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్, గూగుల్‌కు సమన్లు.. ఆగస్టు 3న కీలక సమావేశం

Image Source : Facebook/@Narendra Modi

న్యూఢిల్లీ, జులై 28: దేశంలోని ప్రముఖ సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు జారీ చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, గూగుల్, వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి సంస్థలను డేటా ప్రైవసీ, వినియోగదారుల భద్రత, నిబంధనల అమలుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ అంశాలపై చర్చించేందుకు ఆగస్టు 3, 2026న సాయంత్రం 4 గంటలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఆయా సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు హాజరు కావాల్సి ఉంటుంది.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మహిళలు, చిన్నారులు, రైతులు, కార్మికులు సహా వినియోగదారుల భద్రత కోసం అమలు చేస్తున్న విధానాలు, డేటా గోప్యతకు తీసుకుంటున్న చర్యలపై సంస్థలు వివరాలు ఇవ్వాలని ఆయన తెలిపారు.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే పోస్టులు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే కంటెంట్‌పై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ఆగస్టు 3న జరిగే సమావేశంలో సోషల్ మీడియా సంస్థలకు కొత్త మార్గదర్శకాలు, మరింత కఠిన నిబంధనలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సోషల్ మీడియా వినియోగంపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు